Snakebite | భారత్లో పాముకాటు (Snakebite) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విష సర్పాల కారణంగా దేశంలో ఏటా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు పాముకాటు మరణాలపై బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy) ఆందోళన వ్యక్తం చేశారు.
లోక్సభ (Lok Sabha)లో చర్చ సందర్భంగా బీహార్ రాష్ట్రం సరన్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ ఈ విషయాన్ని లేవనెత్తారు. దేశంలో పాము కాటు కారణంగా ఏటా 50 వేల మంది మరణిస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమన్నారు. ‘భారత్లో ఏటా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. అందులో 50 వేల మంది మరణిస్తున్నారు. ఇది ప్రంపంచలోనే అత్యధికం’ అని సభలో పాము కాటు మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
సభలో సమస్యలపై చర్చ సందర్భంగా వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ (M Kathir Anand).. బీడీ కార్మికుల (beedi workers) దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారన్నారు. కేంద్రం నిధులు సరిపోవడం లేదని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులు దుమ్ము, ఇతర వృత్తిపరమైన ప్రమాదాలకు గురికావడాన్ని గమనించి బడ్జెట్ కేటాయింపుల్లో పరిగణనలోకి తీసుకుని 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించాలని కేంద్రాన్ని కోరారు.
Also Read..
Sampark Kranti Express | సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం
Delhi LG | కోచింగ్ సెంటర్ ఘటన.. నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలిసిన ఎల్జీ వీకే సక్సేనా