Delhi LG | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (Delhi LG) వీకే సక్సేనా (VK Saxena) కలిశారు. సోమవారం ఉదయం ఇన్స్టిట్యూట్ వద్దకు వెళ్లిన ఎల్జీ.. అక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఈ ప్రమాదంపై స్పందించిన ఢిల్లీ ఎల్జీ.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు ఆమోదించదగినవి కాదన్నారు. దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని కవర్ చేసి జూలై 30లోగా నివేదిక సమర్పించాలని డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించారు.
#WATCH | Delhi LG VK Saxena reaches the IAS coaching institute in Old Rajinder Nagar, where 3 UPSC aspirants died due to drowning on 27th July. Protesting students meet him and voice their concerns. pic.twitter.com/i5JMAnWL5E
— ANI (@ANI) July 29, 2024
ఇంతకీ ఏం జరిగిందంటే..?
శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు. రావూస్ అకాడమీలోకి నీళ్లు వచ్చే ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరగా పైకి రండి, త్వరగా.. త్వరగా.. ఎవరైనా మిగిలిపోయారా? అక్కడ ఎవరైనా ఉన్నారా; అంటూ వీడియోలో ఆరాతీసూ ఓ వ్యక్తి కనిపించాడు.
UPSC aspirants’ death | Delhi LG VK Saxena speaks to protesting students in Old Rajinder Nagar, assures them of strict action in the case pic.twitter.com/OTiFrdOtTV
— ANI (@ANI) July 29, 2024
Also Read..
Coaching Centres | ఆ యువత కలలు కల్లలయ్యాయి.. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటనపై శశి థరూర్