Coaching centre tragedy | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశం పార్లమెంట్ ఉభయసభలకు చేరింది. ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు (UPSC Apirants) మృతిచెందిన ఘటనపై చర్చకు లోక్సభలో విపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
సభ ప్రారంభమైన తర్వాత యూపీఎస్సీ అభ్యర్థుల మృతిపై సభలో చర్చ జరపాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి స్పీకర్ ఓం బిర్లా అనుమతివ్వడంతో సభ్యులు దీనిపై చర్చ ప్రారంభించారు. ఈ చర్చ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీలు విరుచుకుపడ్డారు. రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు.
ఈ మేరకు లోక్సభలో బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ (Bansuri Swaraj) మాట్లాడారు. ‘ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ దశాబ్దం పాటు అధికారంలో ఉంది. ఆప్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోలేదు సరికదా.. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ యూపీఎస్సీ విద్యార్థులు మరణించారు’ అని బన్సూరీ స్వరాజ్ ఆరోపించారు. అదేవిధంగా ఈ విషయంపై దర్యాప్తు చేపట్టేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖను ఎంపీ బన్సూరీ స్వరాజ్ కోరారు.
#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, BJP MP Bansuri Swaraj says, “…Those students were in Delhi for the preparation of IAS examinations, but sadly I have to say that due to criminal negligence of Delhi govt, those students have lost their… pic.twitter.com/2alk7SPBDH
— ANI (@ANI) July 29, 2024
యూపీఎస్సీ అభ్యర్థుల మృతిపై చర్చించనున్న రాజ్యసభ..
మరోవైపు యూపీఎస్సీ అభ్యర్థులు (UPSC Apirants) మృతిచెందిన ఘటనపై రాజ్యసభ (Rajya Sabha) లో చర్చించనున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం రాజ్యసభ ఛైర్మన్ (Rajya Sabha Chairman) జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) ప్రకటించారు. జీరో అవర్ ముగిసిన తర్వాత అన్నీ పార్టీల ఫ్లోర్ లీడర్లతో తన ఛాంబర్లో మాట్లాడి.. చర్చా సమయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
యూపీఎస్సీ అభ్యర్థుల మృతిపై సభలో చర్చ జరపాలని కోరుతూ స్వాతిమాలివాల్ సహా ఏడుగురు సభ్యులు రాజ్యసభ ఛైర్మన్ ధన్కర్కు వాయిదా తీర్మానాలను సమర్పించడంతో.. ఆయన పైవిధంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యంవల్ల ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై చర్చించాలని డిమాండ్ చేస్తూ రూల్ 267 కింద ఏడుగురు సభ్యుల నుంచి తనకు నోటీసులు అందాయని ధన్కర్ తెలిపారు. ఆ నోటీసులపై తన ఛాంబర్లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి.. చర్చ సమయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ఈ సందర్భంగా ధన్కర్ మాట్లాడుతూ.. దేశంలో యువ జనాభా భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని తాను గుర్తించానని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు శిక్షణ అనేది ఒక వ్యాపారంగా మారిపోయిందనే విషయాన్ని కూడా తాను గుర్తించానని చెప్పారు. ఎప్పుడు మనం వార్తా పత్రికలు చదివినా.. మొదటి ఒకటి లేదా రెండు పేజీల్లో ఈ శిక్షణా సంస్థలకు సంబంధించిన ప్రకటనలే కనిపిస్తాయని అన్నారు.
Also Read..
Coaching Centres | ఆ యువత కలలు కల్లలయ్యాయి.. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటనపై శశి థరూర్