Coaching Centres | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూర్ (Shashi Tharoor) తాజాగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు.
#WATCH | Delhi’s Old Rajinder Nagar incident | Congress MPs Shashi Tharoor and Jebi Mather arrive at RML Hospital in Delhi to meet the members of the bereaved families.
3 students died after the basement of a coaching institute was filled with water on July 27. pic.twitter.com/OlSG5jh3Te
— ANI (@ANI) July 29, 2024
ఈ మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మరో ఎంపీ జేబీ మాథర్తో కలిసి సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఘటన చాలా సిగ్గుచేటు. ఆ యువత కలలు కల్లలయ్యాయి. వారి కుటుంబాల ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఇది చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి నష్టాన్ని ఎవరూ చవిచూడకూడదు’ అని శశిథరూర్ అన్నారు.
#WATCH | On Delhi’s Old Rajinder Nagar incident, Congress MP Shashi Tharoor says, “This is shameful, there is no doubt about it…The dreams of those youth have been shattered, the hopes of their families have been snuffed too. This is extremely saddening for the country, for its… pic.twitter.com/r3jhcxYZKY
— ANI (@ANI) July 29, 2024
కాగా, శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు. రావూస్ అకాడమీలోకి నీళ్లు వచ్చే ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరగా పైకి రండి, త్వరగా.. త్వరగా.. ఎవరైనా మిగిలిపోయారా? అక్కడ ఎవరైనా ఉన్నారా; అంటూ వీడియోలో ఆరాతీసూ ఓ వ్యక్తి కనిపించాడు.
Also Read..