Jewellery Shop | ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు నగల దుకాణంలోకి (Jewellery Shop) చొరబడ్డారు. తమ వెంట తెచ్చుకున్న గన్నుతో పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపి సుమారు రూ.11 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు (Loot). ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీ ముంబై (Navi Mumbai)లోని ఖర్ఘర్ ప్రాంతంలో (Kharghar area) గల ఓ నగల దుకాణంలోకి ఆదివారం రాత్రి 10గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. ముఖాలకు మాస్కులతో దుకాణంలోకి వెళ్లిన దుండగులు తమ వెంట తెచ్చుకున్న గన్నుతో అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. నాలుగు నుంచి ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం రూ.11.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
మరోవైపు ఘటనపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఖర్ఘర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. దొంగతనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
WATCH: Footage of a robbery with a gun point at a jewellery store caught on CCTV.
Location : Kharghar, Navi Mumbai📍#Maharashtra #NaviMumbai pic.twitter.com/X9duOgJ9D0
— Your Matterz (@YourMatterz) July 29, 2024
Also Read..
Hyderabad | అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాద్ యువకుడు మృతి