హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ (Free Bus For Woman) సౌకర్యం కల్పిస్తూ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఎంతమందికి ఉపయోగపడుతుందో కానీ.. నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగ వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
అయితే ఎట్లా టికెట్ లేకుండా పోవచ్చని మహిళలు.. అవసరం ఉన్నా లేకున్నా బస్సులు ఎక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. టీజీఎస్ ఆర్టీసీ బస్సులో డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న ఓ మహిళ.. ప్రశాతం బ్రష్ చేస్తూ కనిపించింది. ఇంటి వద్ద టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలనుకుందో ఏమో.. మరి!
బస్సులో బ్రష్ చేస్తూ ప్రయాణిస్తున్న మహాలక్ష్మి pic.twitter.com/j56bMn3UO4
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2024