Hyderabad | అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాద్ యువకుడు మృతి
Hyderabad | అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. వీకెండ్ కావడంతో ఈతకు వెళ్లిన అక్షిత్ రెడ్డి.. చెరువులో మునిగి మృతిచెందాడు. గత శనివారం ఈ ఘటన జరగ్గా.. అతని మృతదేహం నిన్న హైదరాబాద్‌కు చేరుకుంది.
Hyderabad | అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. వీకెండ్ కావడంతో ఈతకు వెళ్లిన అక్షిత్ రెడ్డి.. చెరువులో మునిగి మృతిచెందాడు. గత శనివారం ఈ ఘటన జరగ్గా.. అతని మృతదేహం నిన్న హైదరాబాద్‌కు చేరుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్‌రెడ్డి డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అక్షిత్ రెడ్డి (26) ఉన్నారు. పిల్లల చదువుల నిమిత్తం 25 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చిన గోపాల్ రెడ్డి ఫ్యామిలీతో కాటేదాన్‌లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల క్రితమే ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. కుమారుడిని ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా పంపించారు. చికాగోలో ఎంఎస్ పూర్తి చేసిన అక్షిత్ రెడ్డి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.
చదువు పూర్తయ్యి.. ఉద్యోగం కూడా చేస్తుండటంతో అక్షిత్ రెడ్డికి పెళ్లి చేయాలని అతని తండ్రి గోపాల్ రెడ్డి అనుకున్నాడు. దీంతో అక్షిత్ రెడ్డి రెండు నెలల్లో ఇండియాకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో వీకెండ్ కావడంతో గత శనివారం ( జూలై 21వ తేదీన) ఇద్దరు స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ఒకరు ఒడ్డున ఉండగా.. మరో ఇద్దరు చెరువులోకి దిగారు. చెరువు మధ్యలోని ఓ రాయి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒక స్నేహితుడు రాయి వద్దకు చేరుకున్నాడు. కానీ అక్షిత్ రెడ్డి మధ్యలోనే అలసిపోయి వెనక్కి తిరిగాడు. ఈ క్రమంలో వెనక్కి వస్తున్న సమయంలో ఇద్దరు మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు ఒకర్ని కాపాడారు. అక్షిత్ రెడ్డి మాత్రం చెరువులోనే గల్లంతయ్యాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని చెరువంతా గాలించారు. శనివారం రాత్రి వరకు అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా, అక్షిత్ రెడ్డి మృతదేహం వారం రోజుల తర్వాత.. అనగా ఆదివారం ( జూలై 28వ తేదీన) అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. దీంతో అతని అంత్యక్రియలను స్వగ్రామమైన అడ్డాకులలో ఆదివారమే పూర్తిచేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Akshith Reddy
- Chicago
- Hyderabad
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

