న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోచింగ్ సెంటర్ ఎదున విద్యార్థులు ధర్నాకు దిగారు. నగరవ్యాప్తంగా ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లలోనూ భద్రతా ఉల్లంఘనలు ఉన్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో వరదనీరు నిలుస్తుండటంపై వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. స్టడీ సర్కిల్ యాజమాన్యంతో పాటు అధికార యంత్రాంగమే ముగ్గురి మరణానికి కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్లో పెద్ద ఎద్దును పోలీసులను మోహరించారు. మృతుల్లో తెలంగాణ చెందిన యువతి కూడా ఉన్న విషయం తెలిసిందే.
శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు.
#WATCH | Old Rajinder Nagar incident | Delhi: Students continue their protest in Old Rajinder Nagar against the death of 3 students after the basement of their coaching institute here was flooded with rainwater yesterday. pic.twitter.com/DqyYvbP93G
— ANI (@ANI) July 29, 2024
కాగా, సెల్లార్లలో అక్రమంగా నడుస్తున్న 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్‌చేశారు. ఆయా కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్న అభ్యర్థులను ఖాళీచేయాలని సూచించారు. ఇక రావూస్ అకాడమీలోకి నీళ్లు వచ్చే ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. త్వరగా పైకి రండి, త్వరగా.. త్వరగా.. ఎవరైనా మిగిలిపోయారా? అక్కడ ఎవరైనా ఉన్నారా; అంటూ వీడియోలో ఆరాతీసూ ఓ వ్యక్తి కనిపించాడు.
#WATCH | Old Rajinder Nagar incident | Delhi: Security enhanced amid students continuing their protest in Old Rajinder Nagar.
3 students lost their lives, in old Rajinder Nagar after the basement of their coaching institute was flooded with rainwater, yesterday. pic.twitter.com/8Iv5kb4Duh
— ANI (@ANI) July 29, 2024
“Come Up, Quick”: Video Shows Students Rushing Out Of Delhi Coaching Centre https://t.co/QYJrm9ABrq pic.twitter.com/8hhzA0v2to
— NDTV (@ndtv) July 29, 2024