రేవంత్ మోసాలను ప్రజలు క్షమించరు
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించబోరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కారు చిల్లర రాజకీయం చేస్తున్నదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తిచేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు.
- ఇరిగేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అత్యంత బాధాకరం : పొన్నాల
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించబోరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కారు చిల్లర రాజకీయం చేస్తున్నదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తిచేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. అసలు విభజన చట్టంలో లేని పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతులు లేనప్పుడు కేంద్రం కమిటీలను ఎలా వేస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కూడా కేంద్ర కమిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం సభ్యుల పేర్లను ఎందుకు పంపిందని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు ఏవైనా, వివాదాలేవైనా భారత రాజ్యాంగం ఒకటేనని పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా ఏర్పాటుచేస్తున్న సంస్థలను, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిడ్డారు.
తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఏపీ ఏమైనా చేసుకోవచ్చా?
పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ప్ర స్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ వాదనలు విచిత్రంగా ఉన్నాయని పొన్నాల విమర్శించారు. ‘తెలంగాణకు హైదరాబాద్ ఉంది కదా.. ఏపీ సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోకూడదా? అని ఏపీ తరపు అడ్వకేట్ ఎలా వాదిస్తారు?’ అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణలో ఉంటే ఏపీ ఏమైనా చేసుకోవచ్చా? అని వాపోయారు. ‘సాగునీటి ప్రాజెక్టులపై ఏం చేయాలో విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. ఏపీ చేపడుతున్న పోలవరం నల్లమలసాగర్ విభజన చట్టంలో ఎకడున్నది? ఆ ప్రాజెక్టుకు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి లేనపుడు కమిటీలు ఎలా వేస్తారు? అసలు మీటింగ్‌కే పోమని చెప్పిన రేవంత్‌రెడ్డి కేంద్ర కమిటీకి ఎలా ఒప్పుకుంటారు? సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత ఆ కమిటీ కోసం సభ్యుల పేర్లు ఎందుకు పంపారు?’ అని పొన్నాల ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే ‘కమిటీ వేసుకున్నారు కదా.. కోర్టుకు ఎందుకు వచ్చారు’ అని సుప్రీంకోర్టు తెలంగాణను ప్రశ్నించిందని గుర్తుచేశారు. కృష్ణానది, గోదావరి నదుల మధ్య ఉన్న తెలంగాణకు ఎత్తిపోతల పథకాలే శరణ్యమని పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

