18 రోజుల్లో ఆరుగురు బలి!
ఢాకా: బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు లక్ష్యంగా హింసాత్మక దాడులు ఆగటం లేదు. కొంతమంది ఓ హిందూ జర్నలిస్టును తలపై తుపాకీతో కాల్చి చంపగా, ఇది జరిగిన 24 గంటల్లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. బంగ్లాదేశ్లో హింసపై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు కిరాణా దుకాణం యజమాని ఈసారి టార్గెట్గా మారాడు. సోమవారం రాత్రి నార్సింగ్ది సిటీలో శరత్ చక్రవర్తి(40)ని కొంతమంది కత్తులతో దాడి చేసి.. చంపినట్టు స్థానిక మీడియా తెలిపింది. చార్సిందూర్ బజార్లోని దుకాణాన్ని మూసివేసి, ఇంటికి వస్తుండగా అతడిపై కొంతమంది కత్తులతో దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. తాను ఉంటున్న ప్రాంతం ‘వ్యాలీ ఆఫ్ డెత్’గా మారిందని డిసెంబర్ 19న చక్రవర్తి తన ఫేస్బుక్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.