తెలంగాణ దిక్సూచి జయశంకర్ సార్
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.కొత్తపల్లి జయశంకర్ జయంతిని నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీల కతీతంగా నేతలు, అధికారులు జయశంకర్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “స్వరాష్ట్ర సాధనే తన ఊపిరిగా, తన జీవితానికి నిజమైన సార్థకతగా భావించి.. యావజ్జీవితాన్ని ఆ పవిత్ర కర్తవ్యానికే మహోన్నత భావజాలయోధుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సర్.
- ఘనంగా జయంతి వేడుకలు.. పార్టీలకతీతంగా నివాళులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.కొత్తపల్లి జయశంకర్ జయంతిని నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీల కతీతంగా నేతలు, అధికారులు జయశంకర్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “స్వరాష్ట్ర సాధనే తన ఊపిరిగా, తన జీవితానికి నిజమైన సార్థకతగా భావించి.. యావజ్జీవితాన్ని ఆ పవిత్ర కర్తవ్యానికే మహోన్నత భావజాలయోధుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సర్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అడుగడుగునా జరిగిన అన్యాయాలను ఆయన ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఉద్యమానికి బలమైన తాత్విక, సైద్ధాంతిక భూమికను ఏర్పరిచి తన నిజాయితీతో కోట్లాది ప్రజల హృదయాలపై ఆయన చెదరని ముద్ర వేశారు. తెలంగాణకు ఆయన జీవితం ఒక దిక్సూచి” అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో యువత పయనించాలని కోరారు.
నివాళి అర్పించిన డీజీపీ

హైదరాబాద్,ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీజీపీ సీవీ ఆనంద్ పుష్పాంజలి ఘటించారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ చుకానిలా నిలిచారని కొనియాడారు. తెలంగాణ వాదాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పిన మహాజ్ఞాని ఆయన అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీజీ మహేష్ భగవత్ (లా అండ్ ఆర్డర్), డీఐజీ నారాయణ నాయక్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.



Jayasahankar Water Board
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

