తిరువనంతపురం, జనవరి 6: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో నెయ్యి ప్రసాదం అమ్మకంలో అక్రమాలు బయటపడ్డాయి. ఆలయ కౌంటర్లో నెయ్యి అమ్మకాల ఆదాయం తగ్గినట్టు ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్డ్ (టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. రూ.16 లక్షల విలువ చేసే 16 వేల నెయ్యి ప్యాకెట్లు తక్కువైనట్టు గుర్తించామని తెలిపింది. నెయ్యి అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు తన దృష్టికి రాలేదని టీడీబీ అధ్యక్షుడు కే జయకుమార్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న శబరిమల యాత్ర సీజన్లో అమ్ముడైన నెయ్యి ప్యాకెట్లకు, వచ్చిన ఆదాయానికి మధ్య వ్యత్యాసమున్న మాట వాస్తవమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.