Deepika Paduone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తన పుట్టినరోజును అభిమానులతో కలిసి జరుపుకుని మరోసారి అందరి హృదయాలు గెలుచుకున్నారు. ముంబైలో ప్రత్యేకంగా నిర్వహించిన ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్ పార్టీకి కొద్దిమంది అభిమానులను ఆహ్వానించిన దీపికా, వారితో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇటీవల న్యూయార్క్ వెకేషన్‌కు వెళ్లిన దీపికా, అక్కడ భర్త రణవీర్ సింగ్‌తో కలిసి సరదాగా గడిపారు. అదే సమయంలో రణవీర్ నటించిన సినిమా ‘ధురందర్’ విజయాన్ని కూడా సెలబ్రేట్ చేశారు.
అయితే అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కోసం ప్రత్యేకంగా వెకేషన్ నుంచి తిరిగి రావడం దీపికా అభిమానులపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా మారింది. ముంబైలో జరిగిన ఈ చిన్నపాటి వేడుకలో దీపికా అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆ సమయంలో ఆమె ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కనిపించారు. అభిమానులు ఆమెను చూసి ఆనందంతో ‘ఓం శాంతి ఓం’ సినిమా పాటను పాడగా, దీపికా చిరునవ్వుతో స్పందించారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వేడుకలో దీపికా బ్రౌన్ కలర్ స్వెటర్లో సింపుల్ లుక్‌లో కనిపించారు. ఎలాంటి హంగులు లేకుండా సహజంగా కనిపించిన ఆమె స్టైల్ అభిమానులను మరింత ఆకట్టుకుంది. “స్టార్ అయినా కూడా అంత సింపుల్‌గా ఉండటం దీపికాకే సాధ్యం” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దీపికా పదుకోన్ 2007లో షారూఖ్ ఖాన్ సరసన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆ తర్వాత ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘యే జవానీ హై దీవానీ’, ‘పికూ’, ‘పద్మావత్’, ‘కాక్టెయిల్’, ‘పఠాన్’, ‘ఫైటర్’ వంటి ఎన్నో హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె ‘సింగం అగైన్’ చిత్రంలో కనిపించగా, అంతకు ముందు పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 AD’ లో కీలక పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం దీపికా చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి నటిస్తున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ AA22xA6లో కూడా ఆమె భాగమయ్యారు. ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది.
Wishing you a very happy birthday @deepikapadukone 🎂🎉💝 thank you for everything 🎉 #HappyBirthdayDeepikaPadukone pic.twitter.com/hsn0Kpwvxq
— Deepika Files (@FilesDeepika) January 4, 2026