Shilpa Shetty | బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా (Raj Kundra)కు మరోషాక్ తగిలింది. బిట్‌కాయిన్ స్కామ్ (Bitcoin Scam) కేసులో రాజ్ కుంద్రాకు ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది (Court Issues Summons). రాజ్ కుంద్రాతో పాటు దుబాయ్‌లో ఉండే మరో వ్యాపారవేత్త రాజేశ్ సతీజాకు కూడా సమన్లు పంపింది. జనవరి 19న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ముంబైకి చెందిన ‘వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ 2017లో ‘గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్’ను నిర్వహించింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే నెలకు 10శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలయ్యాయి. ఈ మోసం బయటపడటంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.
ఈ స్కామ్‌లో మాస్టర్‌మైండ్ అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్‌కాయిన్స్‌ను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్రణాళికలు వేసినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ కాయిన్స్ ఇప్పటికీ ఆయన వద్దనే ఉన్నాయని.. మార్కెట్ విలువ రూ.150కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్‌లో రాజ్‌కుంద్రా ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు పంపింది. అయితే, ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
Also Read..
Reliance Industries | జామ్‌నగర్ రిఫైనరీకి రష్యా చమురు కార్గోలు.. ఖండించిన రిలయన్స్ ఇండస్ట్రీస్
Tourist Dance: షిల్లాంగ్ వీధుల్లో చిందేసిన విదేశీ మహిళ.. వీడియో వైరల్
Suresh Kalmadi: భారత ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ కన్నుమూత