షిల్లాంగ్: మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లో ఓ విదేశీ మహిళ వీధుల్లో ఫుల్ డ్యాన్స్(Tourist Dance) చేసింది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ.. షిల్లాంగ్‌లోని ఖిండాయి లాడ్ పోలీసు బజార్లో విదేశీ టూరిస్టు తన డ్యాన్స్‌తో థ్రిల్ చేసింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఆమెకు రక్షణ కల్పించిన తీరు ఆన్లైన్ యూజర్లను ఆకట్టుకుంటున్నది. విదేశీ టూరిస్టు చిందేస్తున్న సమయంలో ఆమె చుట్టు ఓ వలయంలా స్థానికులు గుమ్మికూడి ప్రోత్సహించారు. స్వేచ్ఛగా తన సంతోషాన్ని వ్యక్త పరుచుకునే రీతిలో ఆమెను రక్షించారు. సర్కిల్‌గా మారిన జనం.. ఆమెకు కొంత దూరం నుంచే చిందేశారు. ఆన్లైన్లో ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. కొందరు యూజర్లు స్థానికులను మెచ్చుకున్నారు. మహిళా డ్యాన్సర్‌ను గౌరవించిన తీరును కొనియాడారు. స్త్రీలను గౌరవించే షిల్లాంగ్ సంస్కృతిని ప్రదర్శించినట్లు కొందరు ప్రశంసించారు.