Reliance Industries | గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ (Jamnagar refinery)కి రష్యా నుంచి చమురు (Russian Oil) కార్గోలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) స్పందించింది. జామ్‌నగర్ రిఫైనరీకి రష్యా చమురు కార్గోలు అంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. ‘రష్యన్ చమురుతో నిండిన మూడు నౌకలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన జామ్‌నగర్ శుద్ధి కర్మాగారానికి వెళ్తున్నాయి’ అంటూ బ్లూమ్‌బర్గ్‌లో వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.
‘రష్యా చమురుతో (Russian Oil) ఉన్న మూడు నౌకలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీకి బయల్దేరాయంటూ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అది అవాస్తవం. అందులో ఎలాంటి నిజం లేదు. గత 3 వారాల్లో జామ్‌నగర్ రిఫైనరీకి ఎలాంటి రష్యన్ చమురు కార్గోలు రాలేదు. జనవరిలోనూ రష్యా చమురు డెలివరీలను మేం ఆశించడం లేదు. పారదర్శక జర్నలిజం చేస్తున్నామని చెప్పుకునే బ్లూబర్గ్.. మా సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా తప్పుడు కథనాలు రాయడం బాధాకరం’ అని రిలయన్స్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
1999 డిసెంబర్ 28న రిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ స్థాపించారు. ప్రారంభంలో దీని భవిష్యత్ మీద పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతుల్లేవని అంతర్జాతీయ నిపుణులు పెదవి విరిచారు. కానీ, రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీ ఆ అనుమానాలను కొట్టిపారేస్తూ కేవలం 33 నెలల్లోనే రిఫైనరీ నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ హబ్‌గా ఎదిగింది. భారత ఇంధన సరఫరా, ఎగుమతుల్లో ఈ రిఫైనరీ కీలక పాత్ర పోషిస్తోంది.
Also Read..
మార్కెట్లకు టారిఫ్ సెగ.. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
హైదరాబాద్‌లో రివర్ మొబిలిటీ షోరూంలు