న్యూఢిల్లీ, జనవరి 5: ఆరోగ్యాభిలాషులకు హెల్త్ ఫుడ్‌ను అందించడానికి ప్రత్యేకంగా ‘ఈట్‌రైట్’ పేరుతో నూతన సేవలను ఆరంభించింది స్విగ్గీ. ఈ నూతన సేవల్లో భాగంగా అధిక ప్రొటీన్ కలిగిన ఆహార పదార్థాలు, తక్కువ క్యాలరీలు, చక్కెర రహిత ఆహార పదార్థాలను ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఈ నూతన సేవలు అందించడానికి 2 లక్షలకు పైగా రెస్టారెంట్లతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నారని, వీరికోసం ప్రత్యేకంగా ఈ నూతన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలో తెలిపారు. ఈట్‌రైట్ కింద 18 లక్షల ఆహార పదార్థాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది.