Sanju Samson : క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) శివాలెత్తిన తీరుపై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో విధ్వంసక ఆటతో చివరిదాకా నిలబడి భారత్‌ను గెలిపించిన హీరో సంజూను ఆకాశానికెత్తేస్తున్నారు. మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) సైతం శాంసన్‌ను ఎంతో మెచ్చుకున్నాడు. భారీ ఛేదనలో ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా.. అదరక బెదరక చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ తన ఆటతో విరాట్ కోహ్లీని గుర్తు చేశాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
చావోరేవో పోరులో భారత జట్టును గట్టెక్కించిన సంజూ శాంసన్ ఒక్కసారిగా నెట్టింట సెన్సేషన్‌గా మారిపోయాడు. వరల్డ్‌కప్‌లో లీగ్ దశలో బెంచ్‌కే పరిమితమైన ఈ కేరళ బ్యాటర్.. కీలక మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ బౌలర్లను ఉతికేసి అజేయ అర్ధ శతకంతో భారత్‌ను సెమీస్‌కు తీసుకెళ్తాడు. 196 పరుగుల ఛేదనలో శాంసన్ ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీని తలపించాడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
‘ఈడెన్ గార్డెన్స్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ తన సామర్ధ్యానికి న్యాయం చేశాడు. విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత అతడు మైదానంలోనే కూలబడి..ఆకాశంకేసి చూస్తూ చేసుకున్న సెలబ్రేషన్ అతడెంత గొప్పవాడో చాటింది. మనం చాలాసార్లు శాంసన్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఈసారి అతడు 20 ఓవర్లు వికెట్ కాపాడకుంటూ విధ్వంసరచన చేవాడు. ఇది అతడి పిట్నెస్కు నిదర్శనం. నువ్వు మ్యాచ్‌ను ముగించిన తీరు మాకు.. విరాట్ కోహ్లీని గుర్తు చేసింది.

పవర్ ప్లేలో అతడు.. 20, 25, 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు గేర్ మార్చి బౌండరీలు రాబట్టిన తీరును ఆతృతగా గమనించాను. దాదాపు 200ల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ నుంచి మనం అలాంటి ఆటే చూశాం. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై సంజూ సైతం అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడాడు. కోహ్లీతో పోల్చితే శాంసన్ ప్రత్యేకమైన ఆటగాడు. అతడు రిస్క్ ఎక్కువ తీసుకుంటాడు. కండబలాన్నంతా ఉపయోగించి అలవోకగా పెద్ద షాట్లు ఆడతాడు. కాబట్టి.. అతడిని నిలువరించడం ఎవరికైనా కష్టమే’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు.
The way Irfan Pathan said🎙; Sanju Samson deserved this knock, After all the trolling he didn’t let it get to him. The task that Rohit Sharma has always done : leading the team out of pressure situations to win matches, Sanju did the same today🙌🔥
— Gillfied⁷ (@Gill_Iss) March 2, 2026
బిగ్ మ్యాచ్‌లో 10 పరుగులే చేసి.. అభిషేక్ శర్మ విఫలమైన వేళ.. గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న శాంసన్ తన ఎంపికకు న్యాయం చేశాడని ఈ మాజీ పేసర్ అన్నాడు. చెప్పాలంటే తనకు తాను కూడా న్యాయం చేసుకున్నాడని అతడు తెలిపాడు. ఇకపై పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా సంజూ శాంసన్ 97 నాటౌట్ ఇన్నింగ్స్ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటాం అని ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు.
— BCCI (@BCCI) March 1, 2026
జింబాబ్వేపై విజయంతో సెమీస్ రేసులో నిలిచిన టీమిండియా.. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో సంజూ శాంసన్(97 నాటౌట్) అర్ధ శతకంతో విరుచుకుపడగా విండీస్ ఆశల్ని ఆడియాశలయ్యాయి. ఆఖర్లో పాండ్యా(17) ఔటౌనా.. శివం దూబే(8 నాటౌట్) అండగా సంజూ లాంఛనం ముగించాడు. దాంతో.. గ్రూప్ ఏ నుంచి టీమిండియా రెండో బెర్తు ఖరారు చేసుకోగా… రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ ఉసూరుమంటూ టోర్నీ నుంచి నిష్క్రమించింది.