హైదరాబాద్, జనవరి 5: రివర్ మొబిలిటీ..తెలంగాణలో తన వ్యాపారాన్ని భారీగా విస్తరించింది. సోమవారం ఒకేరోజు మూడు షోరూంలను ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ-స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా మూడు షోరూంలను ఆరంభించినట్టు, తద్వారా కస్టమర్లకు మరింత చేరువ కావడానికి వీలు పడనున్నట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో అరవింద్ మణి తెలిపారు.