Sampark Kranti Express | బీహార్ (Bihar)లో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (Sampark Kranti Express) రైలుకు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
సమస్తిపూర్ (Samastipur) జిల్లాలోని ఖుదీరామ్ బోస్ – కర్పూరి గ్రామ్ రైల్వే స్టేషన్ (Karpoori Gram railway station) మధ్య సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జగరలేదన్నారు. ప్రమాద సమయంలో రైలు తక్కువ వేగంతో వెళ్తున్నట్లు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సుమారు గంట పాటు శ్రమించి విడిపోయిన బోగీలను ఇంజిన్‌కు కనెన్ట్ చేసినట్లు తూర్పు మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చంద్ర తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను నిపుణుల బృందం పరీశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు.
Also Read..
Delhi LG | కోచింగ్ సెంటర్ ఘటన.. నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలిసిన ఎల్జీ వీకే సక్సేనా
Supreme Court | ఈడీకి చుక్కెదురు.. హేమంత్ సోరెన్‌కు బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు