IPL 2026 : పొట్టి వరల్డ్‌కప్‌లో వికెట్ల వేటతో అదుర్స్ అనిపించిన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబని (Blessing Muzarabani)కి బంపరాఫర్ వచ్చింది. సంచలన బౌలింగ్‌లో స్టార్ బ్యాటర్లను వణికించిన ఈ ఆఫ్రికా ఆటగాడికి ఐపీఎల్ అవకాశం వచ్చింది. మార్చి 28 నుంచి మొదలయ్యే19వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తరఫున ఈ పొడగరి పేసర్ ఆడనున్నాడు. జింబాబ్వే స్టార్ తమ గూటికి చేరాడనే విషయాన్ని శుక్రవారం కోల్‌కతా యాజమాన్యం ఎక్స్ వేదికగా పంచుకుంది.
ఐసీసీ పురుషుల పొట్టి ప్రపంచకప్‌లో జింబాబ్వే విజయాల్లో కీలకమైన బ్లెస్సింగ్ ముజరబని ఇక ఐపీఎల్లో చెలరేగనున్నాడు. వరల్డ్‌కప్‌లో సత్తా చాటి13 వికెట్లతో రెండో స్థానంలో నిలిచిన ఈ పేసర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ పట్టేసింది. విండీస్ పేసర్ షమర్ జోసెఫ్ స్థానంలో ముజరబనికి చోటు కల్పించినట్టు కేకేఆర్ వెల్లడించింది. పద్దెనిమిదో సీజన్లో బ్యాకప్‌గా రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో చేరిన ముజరబని.. ఈసారి ఊదా, పసిడి రంగు జెర్సీతో మైదానంలోకి దిగనున్నాడు.
A new Blessing in Purple & Gold 💜🔥 pic.twitter.com/p31V3LsGfm
— KolkataKnightRiders (@KKRiders) March 13, 2026
ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్ విడుదల కావడంతో మార్చి 17న ముజరబని కోల్‌కతా స్క్వాడ్‌లో కలువనున్నాడు. ప్రతిభావంతుడైన ఈ పొడగరి పేసర్ రాకతో కోల్‌కతా నైట్ రైడర్స్ పేస్ దళం పటిష్టంగా మారనుంది. ఎందుకంటే.. మినీ వేలంలో రూ.9.20 కోట్లకు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కొన్న కోల్‌కతా.. బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసకు నిరసనగా అతడిని వదిలేసింది.
Get ready for a Blessing, Eden! 🥳💜pic.twitter.com/kJEv0lSFCe
— KolkataKnightRiders (@KKRiders) March 13, 2026
ముస్తాఫిజుర్ స్థానంలో మరొకని తీసుకోలేదు. కానీ, వరల్డ్‌కప్‌లో 13 వికెట్లతో మెరిసిన ముజరబని ఈసారి తమ తురుపుముక్క అవుతాడని కోల్‌కతా భావిస్తోంది. ముజరబని, హర్షిత్ రానా, వైభవ్ రానా, ఉమ్రాన్ మాలిక్, ఆకాశ్ దీప్, కార్తిక్ త్యాగి, ప్రశాంత్ సోలంకీలతో కేకేఆర్ పేస్ దళం పటిష్టంగా కనిపిస్తోంది.