CS Ramakrishna Rao | సభ్యుల ప్రశ్నలకు సమాదానాలు రేపటిలోగా పంపించాలి.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులకు సీఎస్ ఆదేశాలు
CS Ramakrishna Rao | ఈనెల 16 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అధికారులు సభ్యుల ప్రశ్నలకు సమాదానాలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ఆదేశించారు.
హైదరాబాద్ : ఈనెల 16 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్( Assembly Meeting ) సమావేశాలకు సంబంధించిన అధికారులు సభ్యుల ప్రశ్నలకు సమాదానాలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ( CS Ramakrishna Rao) ఆదేశించారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పెండింగులో ఉన్న ప్రశ్నలకు రావాల్సిన సమాధానాలు, సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులతో సి.ఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన మండలి, శాసనసభ సమావేశాల నేపథ్యంలో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ రేపటిలోగా సమాధానాలు పంపించాలని అన్నారు.
నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ పరిపాలన, ఇంధనశాఖ, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించి అధికంగా ప్రశ్నలున్నాయని, వీటన్నింటికీ వెంటనే సమాధానాలు పంపాలని అన్నారు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తో ప్రారంభమవుతాయన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

