Hyderabad | ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ వద్ద వన్‌వే.. వాకర్లతో ముఖాముఖిలో ట్రాఫిక్ పోలీసుల సూచనలు
Hyderabad | హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు వన్‌వే ట్రాఫిక్ విధానం ఆగస్టు 8 నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు కేబీఆర్ పార్క్ వాకర్లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బహిరంగ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.
Hyderabad | హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు వన్‌వే ట్రాఫిక్ విధానం ఆగస్టు 8 నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు కేబీఆర్ పార్క్ వాకర్లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బహిరంగ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ఐపీఎస్, ట్రాఫిక్ డీసీపీ-2 కాజల్, ఐపీఎస్‌తో పాటు పలువురు ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆగస్టు 18 నుంచి అమల్లోకి రానున్న నూతన ట్రాఫిక్ మార్పులపై వాకర్లకు అధికారులు వివరించారు. కొత్త ట్రాఫిక్ విధానం సులభంగా, క్రమబద్ధంగా అమలయ్యేందుకు పార్క్ సందర్శకులు, వాహనదారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల ముఖ్య సూచనలు
- వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాలు (Parking Bays), మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయంలో మాత్రమే నిలపాలి.
- ముఖ్యంగా ఉదయం వేళల్లో రాంగ్రూట్లో వాహనాలు నడపకూడదు.
- ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన సవరించిన నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
- వన్‌వే ట్రాఫిక్ విధానం విజయవంతంగా అమలయ్యేందుకు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి.
నూతన ట్రాఫిక్ నిబంధనలపై కేబీఆర్ పార్క్ వాకర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పార్క్ ముందు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలు సురక్షితంగా, వేగంగా జరిగేందుకు పౌరులు, ముఖ్యంగా నిత్యం కేబీఆర్ పార్క్‌కు వచ్చే సందర్శకులు నూతన ట్రాఫిక్ మార్పులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
– జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

