ముంబై: ఒక ఎమ్మెల్యే పులి వేషంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తన నియోజకవర్గంలో చిరుత పులుల దాడులు పెరుగడంపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. జనంపై చిరుతల దాడి గురించి గత పదేళ్లుగా తాను మొరపెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. (MLA Turns Up As Leopard) మహారాష్ట్రలో ఇటీవీల చిరుతల దాడులు ఎక్కువయ్యాయి. జున్నార్లో గత మూడు నెలల్లో చిరుతల దాడుల్లో 55 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
కాగా, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే శరద్ సోనావానే వినూత్నంగా నిరసన తెలిపారు. పులి మాదిరి దుస్తులు ధరించి ఆ వేషంలో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా శివసేనకు చెందిన జున్నార్ ఎమ్మెల్యే శరద్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర అంతటా పెరుగుతున్న చిరుతపులి దాడులపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి పులి వేషధారణ డ్రెస్ వేసినట్లు తెలిపారు.
మరోవైపు ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి దాదాపు దశాబ్ద కాలంగా తాను ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే శరద్ తెలిపారు. చిరుతపులి దాడులపై రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘2014 నుంచి నేను ఈ సమస్యను లేవనెత్తుతున్నా. కానీ ప్రభుత్వం నన్ను విస్మరిస్తూనే ఉంది’ అని అన్నారు. చిరుతలను బంధించేందుకు రెస్క్యూ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
Nagpur, Maharashtra: Independent MLA Sharad Sonawane of Junnar, Pune Rural, attended the assembly wearing a leopard costume to highlight the frequent leopard-related incidents in his constituency pic.twitter.com/uabnMdER3G
— IANS (@ians_india) December 10, 2025
Also Read:
Newborn Crushed Between Parents | నిద్రిస్తున్న తల్లిదండ్రుల మధ్య నలిగి.. శిశువు మృతి
Police Kidnap Student | విద్యార్థిని కిడ్నాప్ చేసి.. నకిలీ డ్రగ్స్ కేసులో ఇరిగించిన పోలీసులు