భోపాల్: బస్సులో ప్రయాణించిన విద్యార్థిని పోలీసులు కిడ్నాప్ చేశారు. అతడ్ని వెంబడించి డ్రగ్స్‌తో పట్టుకున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు తప్పుగా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. (Police Kidnap Student) అయితే సీసీటీవీ ఫుటేజ్‌లు, ఇతర ఆధారాలు పోలీసుల నకిలీ కేసు బాగోతాన్ని బయటపెట్టాయి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. మాండ్సౌర్ జిల్లాలోని మల్హర్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల సోహన్ 12వ తరగతి చదువుతున్నాడు. ఆగస్ట్ 29న బస్సులో అతడు ప్రయాణించాడు.
కాగా, మల్హర్‌గఢ్ పోలీసులు తమ వాహనంలో వెంబడించి ఆ బస్సును అడ్డుకున్నారు. అందులోకి ఎక్కి సోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మాదకద్రవ్యాల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మీడియా ముందు పోజులిచ్చారు. నిందితుడ్ని వెంబడించి 2.7 కిలోల నల్లమందుతో పట్టుకున్నట్టు పోలీస్ అధికారి ప్రెస్మీట్లో తెలిపారు. అతడ్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు తరలించారు.
మరోవైపు డిసెంబర్ 5న సోహన్ తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్‌ను ఆశ్రయించారు. తమ కుమారుడ్ని పోలీసులు కిడ్నాప్ చేశారని, అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసు నమోదు చేశారని, తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని ఆరోపించారు. సోహన్‌ను పోలీసులు బస్సులో అదుపులోకి తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలు, సాక్షులను కోర్టు ముందు ఉంచారు.
కాగా, ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఇండోర్ బెంచ్ ధర్మాసనం ఈ ఆధారాలు చూసి షాక్ అయ్యింది. మాండ్సౌర్ ఎస్పీ వినోద్ కుమార్ మీనాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో డిసెంబర్ 9న కోర్టు విచారణకు ఆ ఎస్పీ హాజరయ్యారు. అమాయక విద్యార్థిని తమ పోలీసులు బస్సు నుంచి కిడ్నాప్ చేసి తప్పుడు కేసు నమోదు చేసినట్లు అంగీకరించారు. బాధ్యులైన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ సంఘటనపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు.
మరోవైపు గత నెలలో దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్లలో మల్హర్‌గఢ్ పోలీస్ స్టేషన్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అయితే ఆ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు ఒక విద్యార్థిని కిడ్నాప్ చేసి నకిలీ డ్రగ్స్ కేసులో ఇరికించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ సాధించిన ర్యాంకుపై అనుమానాలు వ్యక్తం కావడంతోపాటు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ये देश के सबसे अच्छे पुलिस स्टेशन में से एक की मल्हारगढ़ की पुलिस है, पिछले महीने गृहमंत्री अमित शाह ने ऐलान किया था, उसी थाने के कर्मचारी हैं एक छात्र को जबरन ड्रग्स तस्करी में फंसाने का आरोप है, हाईकोर्ट ने सवाल पूछे अब जाकर निलंबित हुए लेकिन छात्र को २ महीने जेल में रहना पड़ा! pic.twitter.com/tN3IT6fDpJ
— Anurag Dwary (@Anurag_Dwary) December 10, 2025
Also Read:
rabies infected cow dies | రేబిస్ సోకి ఆవు మృతి.. టీకా కోసం క్యూ కట్టిన గ్రామస్తులు
Watch: లైవ్ స్క్రీన్‌లో కనిపించేందుకు కొందరు ఎంపీల ఆరాటం.. సీట్లు మారిన వీడియో వైరల్
Watch: హెల్మెట్ ధరించి కారు నడుపుతున్న వ్యక్తి.. ఎందుకంటే?