లక్నో: కారు డ్రైవ్ చేసే వ్యక్తి హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. ఈ నేపథ్యంలో నాటి నుంచి హెల్మెట్ ధరించి కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. (Man Drives Car Wearing Helmet) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం గుల్షన్ అనే వ్యక్తి హెల్మెట్ ధరించి కారు నడుపుతూ కనిపించాడు. మీడియా ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. తాను ఎప్పుడూ సీట్ బెల్ట్ ధరించి కారు డ్రైవ్ చేస్తానని తెలిపాడు. అయితే హెల్మెట్ ధరించనందుకు నవంబర్ 26న ట్రాఫిక్ పోలీసులు రూ.1,100 జరిమానా విధించినట్లు చెప్పాడు.
కాగా, వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని గుల్షన్ తెలిపాడు. తనకు జరిమానా విధించినప్పటి నుంచి కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరిస్తున్నానని చెప్పాడు. భవిష్యత్తులో కూడా చలాన్ నుంచి తప్పించుకునేందుకు హెల్మెట్ ధరించే కారు నడుపుతానని స్పష్టం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आगरा में एक युवक हेलमेट पहनकर चला रहा है कार,पुलिस ने कार पर काट दिया था विद आउट हेलमेट का चलान,व्यक्ति इतना डर गया है कि अब वो आगरा की सड़कों पर कार में हेलमेट पहनकर ड्राइव करता है।ताकि फिर से उसका चालान ना काटा जाए । pic.twitter.com/SJDpfA8gz6
— Naseem Ahmad (@NaseemNdtv) December 8, 2025
Also Read:
rabies infected cow dies | రేబిస్ సోకి ఆవు మృతి.. టీకా కోసం క్యూ కట్టిన గ్రామస్తులు
Watch: టోల్ ప్లాజా వద్ద కారును ఢీకొట్టిన థార్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: లైవ్ స్క్రీన్లో కనిపించేందుకు కొందరు ఎంపీల ఆరాటం.. సీట్లు మారిన వీడియో వైరల్