చండీగఢ్: టోల్ ప్లాజా వద్ద వేగంగా థార్ దూసుకొచ్చింది. ఒక కారును ఢీకొట్టడంతో అది బోల్తాపడింది. (Car Flips After Thar Rams) ఆ తర్వాత థార్ డ్రైవర్ చాకచక్యంగా వాహనంతో అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. ఘమ్రోజ్ టోల్ ప్లాజా లేన్‌లోకి వెళ్లేందుకు ఒక కారు డ్రైవర్ ప్రయత్నించాడు. వేగంగా దూసుకువచ్చిన థార్ ఆ కారును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆ కారు రోడ్డుపై బోల్తాపడింది. అక్కడున్న స్థానికులు కారు డ్రైవర్‌ను బయటకు తీసేందుకు సహకరించారు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
కాగా, కారును ఢీకొట్టిన థార్ డ్రైవర్ వాహనంతో అక్కడ రౌండ్లు కొట్టాడు. టోల్ ప్లాజా సిబ్బంది, స్థానికుల నుంచి అతడు తప్పించుకున్నాడు. చాకచక్యంగా వెనక్కి మళ్లీ థార్‌లో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కారును ఢీకొట్టిన థార్‌ను గుర్తించారు.
మరోవైపు నిందితుడైన 39 ఏళ్ల డ్రైవర్ భరత్‌ను ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ థార్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: Car Flips After Thar Rams It At Gurugram Toll Plaza, Driver Arrested pic.twitter.com/v0iua8IvXA
— NDTV (@ndtv) December 8, 2025
Also Read:
rabies infected cow dies | రేబిస్ సోకి ఆవు మృతి.. టీకా కోసం క్యూ కట్టిన గ్రామస్తులు