చెన్నై: జూనియర్లు కొట్టడంతో సీనియర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నేపథ్యంలో 15 మంది జూనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ హోమ్‌కు తరలించారు. (juniors beat Student death) తమిళనాడులోని కుంభకోణం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 4న పట్టీశ్వరంలోని ప్రభుత్వ స్కూల్‌కు చెందిన 11, 12వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 12వ తరగతికి చెందిన సీనియర్ విద్యార్థిపై 15 మంది జూనియర్లు దాడి చేశారు. చెక్కతో అతడి తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
కాగా, గాయపడిన ఆ బాలుడ్ని తల్లిదండ్రులు తొలుత కుంభకోణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. అయితే చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మరణించాడు.
మరోవైపు ఆ విద్యార్థి మరణంపై పోలీసులు స్పందించారు. తొలుత హత్యాయత్నంగా నమోదు చేసిన కేసును హత్యగా మార్పు చేశారు. నిందితులైన 15 మంది జూనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేవారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Bride asks for bulb on wedding night | తొలిరాత్రి వేళ బల్బు అడిగిన వధువు.. కంగారుపడి మాయమైన వరుడు
Watch: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌కు పగుళ్లు, వంపు.. తర్వాత ఏం జరిగిందంటే?