బెంగళూరు: రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు సుమారు ఏడు కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. (Students Walks in forest way ) రోడ్డు బాగు చేయించాలని, బస్సు సర్వీసు పునరుద్ధరించాలంటూ సీఎంకు లేఖ రాశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పచ్చెదొడ్డి గ్రామంలోని రోడ్డు పూర్తిగా పాడైంది. దీంతో బస్సు సర్వీసు నిలిచిపోయింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీపు కూడా గ్రామానికి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు సుమారు ఏడు కిలోమీటర్ల మేర నడిచి స్కూల్కు వెళ్తున్నారు.
కాగా, పులులు, చిరుతలు, ఏనుగులు వంటి అటవీ జంతువులు సంచరించే మలే మహదేశ్వర కొండల అటవీ ప్రాంతం గుండా విద్యార్థులు నిత్యం నడిచి స్కూల్కు వెళ్లాల్సి వస్తున్నది. దీంతో అటవీ జంతువుల దాడి గురించి వారు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. పచ్చెదొడ్డి గ్రామంలోని రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరారు.
మరోవైపు తాము క్షేమంగా స్కూల్కు వెళ్లేందుకు సీఎం సిద్ధరామయ్య తక్షణం చర్యలు చేపట్టాలని విద్యార్థులు వేడుకున్నారు. ప్రభుత్వం కాని, స్థానిక ఎమ్మెల్యేగాని తమ దుస్థితి గురించి పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
Also Read:
Navjot Kaur | రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడు: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య
Bride asks for bulb on wedding night | తొలిరాత్రి వేళ బల్బు అడిగిన వధువు.. కంగారుపడి మాయమైన వరుడు
Youth jump into borewell | మొబైల్ కొనుగోలుకు నిరాకరించిన తండ్రి.. బోరుబావిలోకి దూకిన కొడుకు
Watch: హైవేపై ఏనుగుల గుంపు హల్చల్.. వీడియో వైరల్