Navjot Kaur | రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడు: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య
Navjot Kaur | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, ఆ పార్టీ నాయకురాలు నవజ్యోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు. తమ వద్ద డబ్బు లేదని, అయితే అవకాశం ఇస్తే పంజాబ్‌ను ‘స్వర్ణ రాష్ట్రంగా’ మార్చగలమని అన్నారు.
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, ఆ పార్టీ నాయకురాలు నవజ్యోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Navjot Kaur) రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు. తమ వద్ద డబ్బు లేదని, అయితే అవకాశం ఇస్తే పంజాబ్‌ను ‘స్వర్ణ రాష్ట్రంగా’ మార్చగలమని అన్నారు. శనివారం పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను నవజ్యోత్ కౌర్ కలిశారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఇతర సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మీడియాతో నవజ్యోత్ కౌర్ మాట్లాడారు. పంజాబ్‌లో సీఎం అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు. ‘మేం ఎల్లప్పుడూ పంజాబ్, పంజాబీల కోసం మాట్లాడతాం. కానీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి మా వద్ద రూ.500 కోట్లు లేవు’ అని అన్నారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేశారా? అని అడిగినప్పుడు, ఎవరూ డిమాండ్ చేయలేదని చెప్పారు. అయితే ‘రూ.500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు’ అని మరోసారి అన్నారు.
కాగా, పంజాబ్‌ను మెరుగుపరచడానికి ఆ (సీఎం) అధికారాన్ని నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారని, బంగారు రాష్ట్రంగా మారుస్తారని నవజ్యోత్ కౌర్ తెలిపారు. అయితే పంజాబ్ కాంగ్రెస్‌లో ‘అంతర్గత కలహాలు’ ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికే ఐదుగురు నాయకులు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారని తెలిపారు. దీంతో సిద్ధూను వారు ముందుకు రానివ్వరని చెప్పారు. ‘కాంగ్రెస్‌ను ఓడించాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారు (హైకమాండ్) దీనిని అర్థం చేసుకుంటే, అది వేరే విషయం’ అని ఆమె అన్నారు.
మరోవైపు తన భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కాంగ్రెస్‌తో, ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో బలమైన అనుబంధం ఉన్నదని నవజ్యోత్ కౌర్ తెలిపారు. తిరిగి బీజేపీలో ఆయన చేరుతారా? అని అడిగినప్పుడు ఆయన తరుఫున ఆ విషయాన్ని తాను చెప్పలేనని అన్నారు. అయితే సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వస్తారని తెలిపారు. ‘లేకపోతే ఆయన మంచిగా డబ్బు సంపాదిస్తున్నారు. ఆయన సంతోషంగా ఉన్నారు’ అని అన్నారు.
కాగా, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అయిన సిద్ధూ చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేయలేదు.
Also Read:
8th Vachan by Groom | పెళ్లిలో 8వ హామీ ఇచ్చిన వరుడు.. అది విని నవ్వుకున్న వధువు
Watch: షాపు యజమానిని గన్‌తో బెదిరించిన పోలీస్.. గోల్డ్ చైన్ ఇవ్వాలని డిమాండ్
Watch: పాక్ పార్లమెంట్ సమావేశాల్లో గాడిద.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

