లక్నో: ఒక షాపు యజమానిని గన్‌తో పోలీస్ బెదిరించాడు. గోల్డ్ చైన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ షాపులోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ పోలీస్‌ను సస్పెండ్ చేశారు. (cop threatens shopkeeper With Gun) ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొత్వాలి ప్రాంతంలోని లాల్బాగ్ చౌరాహా సమీపంలో ఉన్న స్టోర్ 99ను శుక్రవారం రాత్రి మూసివేస్తుండగా పోలీస్ కానిస్టేబుల్ శ్యామ్ జీ శుక్లా అక్కడకు వచ్చాడు. తనకు కావాల్సింది ఇవ్వాలని అడిగాడు.
కాగా, ఏ వస్తువైనా రూ.99కు లభిస్తుందని షాపు యజమాని చెప్పాడు. తనకు బంగారు గొలుసు కావాలని ఆ పోలీస్ డిమాండ్ చేశాడు. షాపు యజమాని నిరాకరించడంతో అతడ్ని దుర్భాషలాడాడు. గన్ బయటకు తీసి షాపు యాజమానిని బెదిరించాడు.
మరోవైపు ఆ షాపులోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్పందించారు. పోలీస్ కానిస్టేబుల్ శ్యామ్ జీ శుక్లాను సస్పెండ్ చేశారు. ఆయనపై దర్యాప్తు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. దర్యాప్తు తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Ma****hod, tumhen yahin maar daalein?
A UP police constable could be heard threatening to kill a shopkeeper in Sitapur district of Uttar Pradesh. Interestingly, at the provision store, he asked the shopkeeper to bring him a gold chain. Later, he made repeated threats to kill… pic.twitter.com/lktw4aK0qh
— Piyush Rai (@Benarasiyaa) December 6, 2025
Also Read:
Cop Burnt Alive | డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న కారు.. సజీవ దహనమైన పోలీస్ అధికారి
Watch: మృతదేహాన్ని వేరే ప్రాంతంలో పడేసిన పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే?