బెంగళూరు: పోలీస్ అధికారి డ్రైవ్ చేస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు అంటుకున్నాయి. ఆ కారులో చిక్కుకున్న ఆయన సజీవ దహనమయ్యారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Cop Burnt Alive) కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హావేరి లోకాయుక్త కార్యాలయంలో ఇన్స్పెక్టర్ సలీమత్ పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి హుబ్బళ్లి వైపు కారులో ప్రయాణించారు.
కాగా, అన్నీగేరి శివారులోని జాతీయ రహదారిపై ఆ కారు అదుపుతప్పింది. హ్యుందాయ్ ఐ20 డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు కొందరు సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు ఎగసిపడటంతో వెనక్కి తగ్గారు.
మరోవైపు పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. కారు డ్రైవింగ్ సీటులో ఉన్న కాలిన సలీమత్ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు. గడగ్‌లోని కుటుంబ సభ్యులను కలిసేందుకు కారులో ఆయన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Tragic incident in Dharwad, Karnataka 😔
Okuykta Inspector Panchaksharayya Hiremath was charred to death when his car fell into a ditch and caught fire on the night of December 5. Details are still emerging about the circumstances of the accident.#DharwadNews #Karnataka… pic.twitter.com/3uDwHLjsZm— NewsX World (@NewsX) December 6, 2025
Also Read:
Watch: మృతదేహాన్ని వేరే ప్రాంతంలో పడేసిన పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పాక్ పార్లమెంట్ సమావేశాల్లో గాడిద.. వీడియో వైరల్