ఇస్లామాబాద్: పాకిస్థాన్ పార్లమెంటులో ఒక వింత సంఘటన జరిగింది. జాతీయ అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో ఒక గాడిద లోపలకు వచ్చింది. సభ్యుల కూర్చీల వద్దకు దూసుకెళ్లి అలజడి సృష్టించింది. (Donkey In Pak Assembly) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్ పార్లమెంట్ హౌస్‌లోని ఎగువ సభ జాతీయ అసెంబ్లీలో సమావేశం జరుగుతుండగా ఒక గాడిద లోనికి ప్రవేశించింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దానిని బయటకు తరిమేందుకు ప్రయత్నించారు.
కాగా, భయాందోళన చెందిన ఆ గాడిద అలజడి సృష్టించింది. అది సభ్యుల వైపు పరుగెత్తింది. వారి కుర్చీల మీదకు దూసుకెళ్లింది. దీంతో కొందరు ఎంపీలు తమ కుర్చీల నుంచి కిందపడ్డారు. ఇది చూసి మరికొందరు సభ్యులు నవ్వుకున్నారు.
మరోవైపు సెనేట్ చైర్మన్ యూసఫ్ రజా గిలానీ దీనిపై సరదాగా స్పందించారు. ‘జంతువులు కూడా మన చట్టాల్లో పాత్రను కోరుతున్నాయి’ అని హాస్యంగా అన్నారు. దీంతో కొందరు సభ్యులు చప్పట్లు కొట్టారు. అయితే భద్రతా లోపం వల్లనే పార్లమెంట్ హౌస్‌లోకి ఆ గాడిద ప్రవేశించినట్లు తెలిసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
🚨⚡️ UNUSUAL:
“Thrilling Breach” by a Donkey in the Pakistani Parliament Hall Sparks Investigation! 🇵🇰🐴 pic.twitter.com/XaIMdihx2V
— RussiaNews 🇷🇺 (@mog_russEN) December 5, 2025
Watch: A #donkey just stormed into #Pakistan’s Parliament…
Opposition or ruling party?
Hard to tell 😂😂😂 pic.twitter.com/dQ1lN17xEM— Manish Kapadiya 🇮🇳 (@manishkapadiya) December 5, 2025
Also Read:
Watch: వృద్ధురాలి చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Watch: మృతదేహాన్ని వేరే ప్రాంతంలో పడేసిన పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే?