న్యూఢిల్లీ: ఒక వ్యక్తిని మోసం చేసేందుకు స్కామర్ ప్రయత్నించాడు. అయితే దీనిని గ్రహించిన అతడు అలెర్ట్ అయ్యాడు. చాట్‌జీపీటీ సహాయంతో ఆ మోసగాడిని బురిడీకొట్టించాడు. మోసగాడి లొకేషన్‌తోపాటు అతడి ఫొటోను క్యాప్చర్ చేశాడు. (ChatGPT Helps Man to Outsmart Scammer) దీంతో క్షమించాలంటూ ఆ స్కామర్ వేడుకున్నాడు. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి ఫేస్బుక్లో మెసేజ్ వచ్చింది. కాలేజ్ సీనియర్, ఐఏఎస్ అధికారిగా అతడు పేర్కొన్నాడు. సీఆర్పీఎఫ్ అధికారి అయిన తన ఫ్రెండ్ బదిలీ కావడంతో ఆయన ఫర్నిచర్, విలువైన వస్తువులను చాలా తక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపాడు.
కాగా, ఆ మెసేజ్‌పై ఆ వ్యక్తికి అనుమానం కలిగింది. తన కాలేజీ సీనియర్ నంబర్ ఉండటంతో వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. దీంతో అది ఫేక్ మెసేజ్‌గా తెలుసుకున్నాడు. ఆ స్కామర్‌తో ఆడుకోవాలని అతడు భావించాడు. కొంత సమయం తర్వాత ఆర్మీకి సంబంధించిన ఫొటో ఉన్న నంబర్ ద్వారా ఆ మోసగాడు ఆ వ్యక్తిని సంప్రదించాడు. క్యూఆర్ కోడ్ పంపి డబ్బు చెల్లించాలని చెప్పాడు.
మరోవైపు క్యూఆర్ కోడ్ స్కానింగ్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లుగా ఢిల్లీ వ్యక్తి నటించాడు. జీపీఎస్ లోకేషన్ పసిగట్టి స్కామర్ డివైజ్‌లోని కెమెరా ద్వారా అతడి ఫొటో క్యాప్చర్ చేసే విధంగా చాట్‌జీపీటీ సహాయంతో వెబ్‌పేజీ కోడ్ రూపొందించాడు. ట్రాకర్ పేజీ లింక్‌ను స్కామర్‌కు పంపాడు. అందులో ఉన్న క్యూఆర్ కోడ్ అప్లోడ్ చేస్తే చెల్లింపు ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపాడు.
కాగా, స్కామర్ ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. దీంతో ఆ మోసగాడు ఉన్న ఖచ్చితమైన జీపీఎస్ కోఆర్డినేట్లు, ఐపీ చిరునామా, అతడి స్పష్టమైన ముఖం క్యాప్చర్ అయ్యింది. ఆ తర్వాత ఢిల్లీ వ్యక్తి స్కామర్‌కు అతడి ఫొటో, ఎక్కడ ఉన్నాడో అన్న వివరాలు పంపాడు. ‘రాజస్థాన్ పోలీసులు నీ ప్లేస్‌కు వస్తున్నారు. జైలు జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి’ అని పేర్కొన్నాడు. దీంతో ఆ స్కామర్ భయపడిపోయాడు. ‘నా తల్లిపై ప్రమాణం చేస్తున్నా, నేను మళ్ళీ ఇలా చేయను. నన్ను క్షమించు’ అని వేడుకున్నాడు. ఢిల్లీ వ్యక్తి ఈ విషయాన్ని రెడ్డిట్‌లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
Watch: 140కుపైగా వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎందుకంటే?
Man Slits Daughter’s Throat | భార్యపై అనుమానంతో.. నిద్రిస్తున్న కుమార్తె గొంతు కోసిన వ్యక్తి
Watch: 140కుపైగా వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎందుకంటే?