ముంబై: భార్యకు వివాహేతర సంబంధం ఉన్నదని ఒక వ్యక్తి అనుమానించాడు. అయితే నిద్రిస్తున్న కుమార్తె గొంతును బ్లేడ్‌తో కోశాడు. కూతుర్ని కాపాడేందుకు ప్రయత్నించిన భార్యపై కూడా బ్లేడ్‌తో దాడి చేశాడు. (Man Slits Daughter’s Throat) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. హనుమంత్ సోనావాలే ఏ పని చేయకపోగా మద్యానికి బానిస అయ్యాడు. భార్య రాజశ్రీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించి తరచుగా ఆమెను కొట్టేవాడు.
కాగా, భర్త హింసను భరించలేని భార్య రాజశ్రీ ఒక లాయర్ ద్వారా విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేసింది. ఇది తెలిసి హనుమంత్ సోనావాలే మరింత రెచ్చిపోయాడు. భార్యతో గొడవపడ్డాడు. గురువారం తెల్లవారుజామున నిద్రిస్తున్న 14 ఏళ్ల కుమార్తె గొంతును బ్లేడ్‌తో కోశాడు.
మరోవైపు కూతురి అరుపులకు రాజశ్రీ మేల్కొన్నది. భర్తను అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భార్య పొట్టపై బ్లేడ్‌తో భర్త దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా హనుమంత్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, గాయపడిన భార్య, కుమార్తెను హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు. గాయాలకు కుట్లు చేసిన డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Poisonous gas leak | విషపూరిత వాయువు లీక్.. ఇద్దరు మహిళలు మృతి, పలువురికి అస్వస్థత
Alcohol, Drugs, Affairs | ‘నా భర్త వ్యసనపరుడు’.. వరకట్న వేధింపులపై గవర్నర్ మనవడి భార్య ఫిర్యాదు
Nitin Gadkari | ‘130 కిలోమీటర్ల వేగంతో మేం డ్రైవ్ చేయలేం’.. నితిన్ గడ్కరీ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ