రాంచీ: భూగర్భ గనుల నుంచి విషపూరిత వాయువు లీక్ అయ్యింది. (Poisonous gas leak) ఇద్దరు మహిళలు మరణించగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విష వాయువు లీక్ వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)కు చెందిన భూగర్భ గని నుంచి విష వాయువైన కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయ్యింది.
కాగా, కెందువాడి బస్తీలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మహిళలు మరణించినట్లు తెలుస్తున్నది. దీంతో ధన్‌బాద్-రాంచీ రహదారిని ఆ ప్రాంతవాసులు దిగ్బంధించారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు.
మరోవైపు భూగర్భ గని నుంచి విష వాయువు కార్బన్ మోనాక్సైడ్ లీక్ కావడంపై బీసీసీఎల్ కంపెనీ స్పందించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోనేందుకు మూడు అంబులెన్స్‌లను అక్కడ సిద్ధంగా ఉంచింది. ఆ ప్రాంతవాసులు అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించింది.
సమారు వెయ్యి మందికిపైగా ప్రజలు వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని కోరుతూ వారి ఇళ్ల గోడలకు ఆ కంపెనీ నోటీసులు అంటించింది. నివాసితులను సురక్షితమైన ప్రదేశాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ ఏరియా మేనేజర్ తెలిపారు.
#WATCH | Dhanbad, Jharkhand: 2 women lost their lives as a gas leak in Kenduadih escalated. Villagers blocked the Dhanbad-Ranchi main road and burned tyres in protest against the district administration and the BCCL (Bharat Coking Coal Limited) management. pic.twitter.com/igWcKvy9De
— ANI (@ANI) December 4, 2025
Also Read:
Alcohol, Drugs, Affairs | ‘నా భర్త వ్యసనపరుడు’.. వరకట్న వేధింపులపై గవర్నర్ మనవడి భార్య ఫిర్యాదు
Nitin Gadkari | ‘130 కిలోమీటర్ల వేగంతో మేం డ్రైవ్ చేయలేం’.. నితిన్ గడ్కరీ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ
Watch: స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు.. బాలుడు ఏం చేశాడంటే?