లక్నో: స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు బాలుడు పెద్ద సాహసం చేశాడు. కదులుతున్న బైక్ నుంచి కిందకు దూకాడు. దీంతో ఆ బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఆ బాలుడు అక్కడి నుంచి ఇంటికి పరుగెత్తాడు. (Child Jumps Off Moving Bike To Avoid School) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరౌర్కు చెందిన పుట్టన్ సిద్ధిఖీ బుధవారం తన ముగ్గురు మనవళ్లు అహాన్, ఆతిబ్, ఆషిక్‌ను మినాపూర్లోని స్కూల్‌కు బైక్‌పై తీసుకెళ్తున్నాడు.
కాగా, ఇంటి నుంచి కొంతదూరం వెళ్లిన తర్వాత చిన్న మనవడు అహాన్ ఉన్నట్టుండి బైక్ నుంచి కిందకు దూకాడు. దీంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడింది. మిగతా పిల్లలతో పాటు సిద్ధిఖీ కూడా కిందపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.
మరోవైపు పైకి లేచిన అహాన్ అక్కడి నుంచి ఇంటి వైపు పరుగెత్తాడు. స్కూల్ ఎగ్గొట్టేందుకు తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అతడి కోసం ఇంటికి వెళ్లిన సిద్ధిఖీ ఇది తెలుసుకున్నాడు. ఆ తర్వాత మిగతా మనవళ్లను స్కూల్ వద్ద దించాడు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన అహాన్ బైక్ నుంచి దూకిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कानपुर देहात
⏩ स्कूल जाने से बचने के लिए बच्चे ने दिखाई खतरनाक हरकत
⏩ चलती बाइक से बच्चे ने अचानक छलांग लगाई
⏩ छलांग मारते ही बाइक अनियंत्रित होकर सड़क पर गिर गई
⏩ बाइक पर सवार बाबा और दो बच्चे भी गिरे, गनीमत कोई घायल नहीं हुआ
⏩ मासूम स्कूल न जाने को लेकर जिद पर अड़ा,… pic.twitter.com/sRBHyQBAcY
— हिन्दी ख़बर | Hindi Khabar 🇮🇳 (@HindiKhabar) December 3, 2025
Also Read:
Woman Kills Girl | అందంగా ఉన్నదని బాలికను చంపిన మహిళ.. గతంలో కొడుకుతో సహా ముగ్గురు పిల్లలు హత్య
Watch: కారు రివర్స్ చేసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం.. హాస్పిటల్స్‌కు వ్యాపించిన మంటలు, పిల్లలను రక్షించిన స్థానికులు