అహ్మదాబాద్: ఒక కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ నుంచి వెలువడిన మంటలు, పొగలు సమీపంలోని హాస్పిటల్స్‌కు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో స్థానికులు స్పందించారు. హాస్పిటల్స్‌లోని చిన్నారులను బయటకు తెచ్చి రక్షించారు. (Bhavnagar Complex Fire) గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం కాలా నాలా ప్రాంతంలోని పలు ఆసుపత్రులు, షాపులున్న కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దేవ్ పాథాలజీ ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. ఆ కాంప్లెక్స్‌లో ఉన్న ఆసుపత్రులు, ఇతర కార్యాలయాలకు మంటలు, పొగలు వ్యాపించాయి.
కాగా, గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. నిచ్చెనల ద్వారా పైకి ఎక్కి ఒక ఆసుపత్రి నుంచి సుమారు 15 మందికి పైగా శిశువులు, చిన్నారులను చేతుల మీదుగా బయటకు తీసుకువచ్చారు. ఇతర హాస్పిటల్స్‌లోని రోగులు, వృద్ధులను కూడా క్షేమంగా తరలించారు. ఆరు అగ్నిమాపక వాహనాల్లో చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.
మరోవైపు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, పలు హాస్పిటల్స్‌లోని చిన్నారులు, రోగులను స్థానికులు, ఫైర్ సిబ్బంది రక్షించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Massive fire breaks out at Bhavnagar complex housing multiple hospitals; 20 including infants rescuedhttps://t.co/Jji2cUOsXy pic.twitter.com/35CEK9R59h
— DeshGujarat (@DeshGujarat) December 3, 2025
Also Read:
Madhya Pradesh | విమాన ప్రయాణాల కోసం.. రోజుకు రూ.21 లక్షలు ఖర్చు చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
Army Soldier Dies | కాలువలో మునిగిన ఆర్మీ ట్యాంక్.. సైనికుడు మృతి
Woman’s Jaw Dislocates | పానీపూరీ తినేందుకు పెద్దగా నోరు తెరిచిన మహిళ.. విరిగిన దవడ