జైపూర్: సైనిక విన్యాసాల్లో భాగంగా ఆర్మీ ట్యాంకు కాలువలో చిక్కుకుని మునిగిపోయింది. అందులో ఉన్న ఇద్దరు సైనికుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా మరో సైనికుడు మరణించాడు. (Army Soldier Dies) విపత్తు ప్రతిస్పందన దళం సహాయంతో సైనికుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం సాధారణ సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరా గాంధీ కాలువను దాటేందుకు ఆర్మీ ట్యాంకు ప్రయత్నించింది.
కాగా, ఆ కాలువ మధ్యలో ఆర్మీ ట్యాంకు చిక్కుకున్నది. అక్కడ అది మునిగిపోయింది. అందులో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఒకరు బయటకు రాగా మరొకరు ట్యాంకు లోపల చిక్కుకున్నాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పౌర రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి.
మరోవైపు కాలువలో మునిగిన ఆర్మీ ట్యాంకులో చిక్కుకున్న సైనికుడ్ని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పలు గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆ సైనికుడి మృతదేహాన్ని బయటకు తెచ్చారు. పోస్ట్‌మార్టం కోసం ఆ జవాన్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Madhya Pradesh | విమాన ప్రయాణాల కోసం.. రోజుకు రూ.21 లక్షలు ఖర్చు చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
Woman’s Jaw Dislocates | పానీపూరీ తినేందుకు పెద్దగా నోరు తెరిచిన మహిళ.. విరిగిన దవడ
Watch: కస్టమర్‌గా నటించి.. బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన వ్యక్తి