Watch: కస్టమర్‌గా నటించి.. బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన వ్యక్తి
Man Ran away with Gold Chains | ఒక వ్యక్తి కస్టమర్‌గా నటించాడు. సూటు, బూటు ధరించి జ్యూయలరీ షాపులోకి ప్రవేశించాడు. గోల్డ్ చైన్స్ కొనుగోలు పేరుతో వాటిని పరిశీలించాడు. షాపు ఓనర్, సిబ్బంది పరధ్యానంలో ఉండటం చూసి మూడు బంగారు గొలుసులతో పారిపోయాడు.
లక్నో: ఒక వ్యక్తి కస్టమర్‌గా నటించాడు. సూటు, బూటు ధరించి జ్యూయలరీ షాపులోకి ప్రవేశించాడు. గోల్డ్ చైన్స్ కొనుగోలు పేరుతో వాటిని పరిశీలించాడు. షాపు ఓనర్, సిబ్బంది పరధ్యానంలో ఉండటం చూసి మూడు బంగారు గొలుసులతో పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Ran away with Gold Chains) ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో సదర్ కొత్వాలి ప్రాంతంలోని హల్వాయి చౌక్‌లో ఉన్న జుగల్ కిషోర్ ప్రహ్లాది లాల్ జ్యువెలర్స్‌లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. బ్లాక్ జీన్స్, బ్లాక్ కోటుతోపాటు బూట్లు వేసుకున్న అతడు ఒకటిన్నర తులాల బరువున్న బంగారు గొలుసులను చూపించమని అడిగాడు.
కాగా, కొనుగోలుదారుడిగా నమ్మిన షాపు యజమాని, సిబ్బంది ఆ వ్యక్తికి గోల్డ్ చైన్స్ చూపించారు. డిజైన్లు చూసిన అతడు ప్రశ్నలతో వారిని ముంచెత్తాడు. కొంతసేపు తర్వాత బంగారు ఆభరణాల కోసం కొంత మంది ఆ షాపులోకి వచ్చారు. ఈ బిజీలో షాపు యజమాని, సిబ్బంది పరధ్యానంలో ఉండడాన్ని ఆ వ్యక్తి గమనించాడు. బాక్స్‌లో ఉన్న మూడు బంగారు గొలుసులను చేజిక్కుంచుకుని పక్కన కూర్చొన్న మహిళను తోసుకుని ఆ షాపు నుంచి వేగంగా బయటకు పారిపోయాడు. జనంలో కలిసిపోయి మాయమయ్యాడు.
మరోవైపు షాపు యజమాని ఇది చూసి షాక్ అయ్యాడు. గోల్డ్ చైన్స్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. జ్యుయలరీ షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. గోల్డ్ చైన్స్‌తో పారిపోయిన నిందితుడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी – जिला बदायूं में एक कस्टमर ज्वेलरी शॉप से सोने की 3 चेन उठाकर भाग निकला !! pic.twitter.com/WyO3e7Hxj5
— Sachin Gupta (@SachinGuptaUP) November 28, 2025
Also Read:
AAP leader Rajesh Gupta | బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే.. కన్నీటితో కేజ్రీవాల్‌కు సలహా
Cash Found In Room 22 At Al-Falah | అల్ ఫలాహ్లోని 22వ గదిలో.. రూ.18 లక్షల డబ్బు లభ్యం
Watch: ఏఐ టీచర్‌ను రూపొందించిన కాలేజీ విద్యార్థి.. టీచింగ్ చేస్తున్న వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

