Watch: ఏఐ టీచర్‌ను రూపొందించిన కాలేజీ విద్యార్థి.. టీచింగ్ చేస్తున్న వీడియో వైరల్
Student Creates AI Teacher | ఒక కాలేజీ విద్యార్థి ఏఐ టీచర్‌ను తయారు చేశాడు. ఈ రోబో టీచర్ ప్రతిభను క్లాస్‌రూమ్‌లో ప్రదర్శించాడు. ఆ స్టూడెంట్ అడిగిన ప్రశ్నలకు ఏఐ టీచర్ సమాధానం చెప్పింది. భవిష్యత్తులో బ్లాక్ బోర్డుపై రాసి బోధించే విధంగా దీనిని అభివృద్ధి చేస్తానని ఆ విద్యార్థి తెలిపాడు.
లక్నో: ఒక కాలేజీ విద్యార్థి ఏఐ టీచర్‌ను తయారు చేశాడు. ఈ రోబో టీచర్ ప్రతిభను క్లాస్‌రూమ్‌లో ప్రదర్శించాడు. ఆ స్టూడెంట్ అడిగిన ప్రశ్నలకు ఏఐ టీచర్ సమాధానం చెప్పింది. (Student Creates AI Teacher) భవిష్యత్తులో బ్లాక్ బోర్డుపై రాసి బోధించే విధంగా దీనిని అభివృద్ధి చేస్తానని ఆ విద్యార్థి తెలిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల ఆదిత్య కుమార్ బులంద్‌షహర్‌లోని శివ చరణ్ ఇంటర్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్నాడు. ఏఐ టీచర్‌ను అతడు రూపొందించాడు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) చిప్సెట్ ఉపయోగించి రోబో టీచర్‌ను తయారుచేశాడు.
కాగా, ఏఐ రోబో టీచర్‌కు ‘సోఫీ’ అని ఆదిత్య కుమార్ పేరుపెట్టాడు. ఏఐ టీచర్ ప్రతిభను క్లాస్ రూమ్‌లో ప్రదర్శించాడు. దీంతో రోబో టీచర్ సోఫీ విద్యార్థులను పరిచయం చేసుకున్నది. ‘నేను ఏఐ టీచర్ రోబోట్. నా పేరు సోఫీ. నన్ను ఆదిత్య తయారు చేశాడు. బులంద్‌షహర్‌లోని శివచరణ్ ఇంటర్ కాలేజీలో నేను బోధిస్తా’ అని పేర్కొంది.
మరోవైపు తన నుంచి ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అని క్లాస్‌రూమ్‌లోని విద్యార్థులను ఏఐ రోబో టీచర్ సోఫీ అడిగింది. దీంతో ఆదిత్య కుమార్ కొన్ని ప్రశ్నలు సంధించాడు. భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు అని అడగ్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని సమాధానం చెప్పింది. దేశ తొలి ప్రధానమంత్రి పేరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని కరెక్టుగా చెప్పింది.
కాగా, తాను తయారు చేసిన ఏఐ రోబో టీచర్ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తుందని ఆదిత్య కుమార్ తెలిపాడు. ప్రస్తుతానికి కేవలం మాట్లాడే ఈ రోబో టీచర్‌ను భవిష్యత్తులో బోర్డుపై రాసి పాఠాలు చెప్పే విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పాడు. విద్యార్థుల పరిశోధన కోసం ప్రతి జిల్లాలో ఒక ప్రయోగశాల ఉండాలని అతడు కోరాడు. ఆదిత్య కుమార్ ఆవిష్కరణను ఆ కాలేజీ టీచర్లు, స్టూడెంట్లు ప్రశంసించారు. ఈ ఏఐ రోబో టీచర్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Bulandshahr, UP | A 17-year-old student from Shiv Charan Inter College, Aditya Kumar, has built an AI teacher robot named Sophie, equipped with an LLM chipset.
The robot says, “I am an AI teacher robot. My name is Sophie, and I was invented by Aditya. I teach at… pic.twitter.com/ArJYSsf39F
— ANI (@ANI) November 29, 2025
Also Read:
Watch: పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు వేదిక ఎక్కిన బీజేపీ నేతలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఉదయనిధి పుట్టినరోజు వేడుకలో అశ్లీల డ్యాన్సులు.. మంత్రి తీరుపై విమర్శలు
Watch: చిరుత కోసం బోను ఏర్పాటు.. అందులో చిక్కుకున్న తాగుబోతు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

