AAP leader Rajesh Gupta | బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే.. కన్నీటితో కేజ్రీవాల్‌కు సలహా
AAP leader Rajesh Gupta | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ గుప్తా శనివారం ఆప్‌ను వీడారు. బీజేపీలో ఆయన చేరారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ గుప్తా శనివారం ఆప్‌ను వీడారు. బీజేపీలో ఆయన చేరారు. (AAP leader Rajesh Gupta) గతంలో ఆప్ జాతీయ ప్రతినిధిగా, ఆప్ కర్ణాటక ఇన్చార్జ్గా పనిచేసిన రాజేష్ గుప్తా, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
కాగా, ఈ సందర్భంగా రాజేష్ గుప్తా ఆప్‌పై పలు విమర్శలు చేశారు. అన్నా హజారే ఆందోళన సమయంలో తమ ఉద్యోగాలను వదిలేసిన వారిని ఆప్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆప్ నేతలు, కార్యకర్తలను వాడుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. ‘అరవింద్ జీ, ప్రజలు మిమ్మల్ని ఎందుకు విడిచిపెడుతున్నారో మీరు ఆలోచించాలి. నేను ఎల్లప్పుడూ మీ కోసం పోరాడాను, టెలివిజన్‌లో కూడా’ అంటూ భావోద్వేగం చెందారు.
మరోవైపు ఆప్ నేతలు, కార్యకర్తలను ‘యూజ్ అండ్ త్రో’ పద్ధతిలో చూసే అలవాటే ఆప్, అరవింద్ కేజ్రీవాల్ పతనానికి కారణమని రాజేష్ గుప్తా విమర్శించారు. ‘ఆప్ ఏర్పడినప్పుడు, చాలా మంది ప్రసిద్ధ వ్యక్తులు కేజ్రీవాల్‌తో చేతులు కలిపారు. కానీ ఆయన ‘అందరికీ ద్రోహం’ చేశారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడాల్సి వచ్చింది. ఈరోజు దురదృష్టవశాత్తు, నేను కూడా ఆ జాబితాలో చేరాను’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
VIDEO | Delhi: Former AAP MLA leader Rajesh Gupta gets emotional during a press conference after joining the BJP, he says, “They (AAP) don’t care about the people now who left their jobs during Anna Andolan… Many people want to leave (AAP), and I think they should. It’s not… pic.twitter.com/XjSV1Nxuju
— Press Trust of India (@PTI_News) November 29, 2025
Also Read:
Cash Found In Room 22 At Al-Falah | అల్ ఫలాహ్లోని 22వ గదిలో.. రూ.18 లక్షల డబ్బు లభ్యం
protesters set police on fire | పోలీసులపై పెట్రోల్ చల్లి.. నిప్పంటించిన నిరసనకారులు
BJP Leader Shot | బీజేపీ సీనియర్ నేతపై కాల్పులు.. ఆరోగ్య పరిస్థితి విషమం
Watch: ఏఐ టీచర్‌ను రూపొందించిన కాలేజీ విద్యార్థి.. టీచింగ్ చేస్తున్న వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP Leader
- Advice
- Breaks Down
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

