BJP Leader Shot | బీజేపీ సీనియర్ నేతపై కాల్పులు.. ఆరోగ్య పరిస్థితి విషమం
BJP Leader Shot | గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ సీనియర్ నేతపై కాల్పులు జరిపారు. ఛాతిలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లిన ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ఆ బీజేపీ నేత ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలిసి స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు షాక్ అయ్యారు.
పాట్నా: గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ సీనియర్ నేతపై కాల్పులు జరిపారు. ఛాతిలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లిన ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ఆ బీజేపీ నేత ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. (BJP Leader Shot) ఈ విషయం తెలిసి స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు షాక్ అయ్యారు. మరోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖగారియా బీజేపీ యూనిట్లో ప్రముఖ నేత దిలీప్ కుమార్. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన ఆయన ప్రస్తుతం మండల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
కాగా, శుక్రవారం పట్టపగలు గంగౌర్ ప్రాంతంలో బీజేపీ నేత దిలీప్ కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఛాతిలో బుల్లెట్లు చొచ్చుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తొలుత ఖగారియా సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం ఉన్నత ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. బీజేపీ నేత దిలీప్ కుమార్‌పై కాల్పులు జరిపిన నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను గుర్తించిన తర్వాతమే ఆయనపై ఎందుకు కాల్పులు జరిపారు అన్నది దర్యాప్తులో తెలుస్తుందన్నారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
#Bihar में नई सरकार के गठन के बाद भी अपराधियों का तांडव जारी. खगड़िया में #BJP नेता दिलीप सिंह को दिनदहाड़े गोली मारी गयी. उन्हें गंभीर हालत में अस्पताल में भर्ती कराया गया है. #BiharNews #BiharPolice #BiharCrime #BiharPolitics pic.twitter.com/qK9dGL6hk1
— FirstBiharJharkhand (@firstbiharnews) November 28, 2025
Also Read:
Watch: రాజస్థాన్‌లో గ్యాంగ్ వార్.. బైక్‌ను వాహనంతో ఢీ, కాల్పులు
Watch: స్కై-డైనింగ్ రెస్టారెంట్లో చిక్కుకున్న టూరిస్టులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: చిరుత కోసం బోను ఏర్పాటు.. అందులో చిక్కుకున్న తాగుబోతు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

