protesters set police on fire | పోలీసులపై పెట్రోల్ చల్లి.. నిప్పంటించిన నిరసనకారులు
protesters set police on fire | నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. చేతిలోని బాటిల్స్‌లో ఉన్న పెట్రోల్ పోలీసులపై చల్లారు. ఒక పోలీస్ అధికారికి నిప్పంటించారు. దీంతో ఆయనకు కాలిన గాయాలయ్యాయి.
చండీగఢ్: నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. చేతిలోని బాటిల్స్‌లో ఉన్న పెట్రోల్ పోలీసులపై చల్లారు. ఒక పోలీస్ అధికారికి నిప్పంటించారు. (protesters set police on fire) దీంతో ఆయనకు కాలిన గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం స్థానిక కాంట్రాక్ట్ రోడ్‌వేస్ ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం నిరసనకు దిగారు. కొందరు బస్సులపైకి ఎక్కి నినాదాలు చేశారు. వారి చేతుల్లో పెట్రోల్ ఉన్న బాటిల్స్ ఉన్నాయి.
కాగా, నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు తమ చేతుల్లో ఉన్న బాటిల్స్‌లోని పెట్రోల్‌ను కొందరు పోలీసులపై చల్లారు. పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) ఇన్స్పెక్టర్ జస్వీర్ సింగ్ యూనిఫార్మ్‌పై పెట్రోల్ పడటంతో ఎవరో నిప్పంటించారు. దీంతో ఆయన డ్రెస్‌కు మంటలు అంటుకున్నాయి.
మరోవైపు అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించారు. పోలీస్ అధికారి జస్వీర్ సింగ్ యూనిఫార్మ్‌కు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. కాలిన గాయాలైన ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. కాంట్రాక్ట్ రోడ్‌వేస్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో పది మంది నిరసనకారులపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bhagwant ਸਰਕਾਰ ਖ਼ਿਲਾਫ ਪ੍ਰਦਰਸ਼ਨ ਕਰ ਰਹੇ ਮੁਲਾਜ਼ਮਾ ਨੇ ਸੁੱਟਿਆ Petrol ਤਾਂ SHO ਨੂੰ ਲੱਗੀ ਅੱਗ | Punjab Tak #bhagwantmann #prtc #punbus #sangrurnews pic.twitter.com/g4T0D2QPkZ
— Punjab Tak (@PunjabTak) November 28, 2025
Also Read:
BJP Leader Shot | బీజేపీ సీనియర్ నేతపై కాల్పులు.. ఆరోగ్య పరిస్థితి విషమం
Watch: ఏఐ టీచర్‌ను రూపొందించిన కాలేజీ విద్యార్థి.. టీచింగ్ చేస్తున్న వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Petrol
- Police
- Protesters
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

