Cash Found In Room 22 At Al-Falah | అల్ ఫలాహ్లోని 22వ గదిలో.. రూ.18 లక్షల డబ్బు లభ్యం
Cash Found In Room 22 At Al-Falah | ఢిల్లీలో సంచలనం రేపిన కారు బాంబ్ బ్లాస్ట్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నది. నిందితురాలైన షహీద్ సయీద్‌ను అల్ ఫలాహ్ యూనివర్సిటీకి అధికారులు తీసుకెళ్లారు. ఆమెకు కేటాయించిన రూమ్ నంబర్ 22లో సోదా చేయగా రూ.18 లక్షల డబ్బు బయటపడింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన కారు బాంబ్ బ్లాస్ట్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా నిందితురాలైన షహీద్ సయీద్‌ను అల్ ఫలాహ్ యూనివర్సిటీకి అధికారులు తీసుకెళ్లారు. ఆమెకు కేటాయించిన రూమ్ నంబర్ 22లో సోదా చేయగా రూ.18 లక్షల డబ్బు బయటపడింది. (Cash Found In Room 22 At Al-Falah) గురువారం ఎన్ఐఏ అధికారులు అల్ ఫలాహ్ క్యాంపస్‌ను తనిఖీ చేశారు. నిందితురాలు షహీద్ సయీద్ సమక్షంలో ఆమె నివసించిన రూమ్ నంబర్ 22తో పాటు ఆమె క్యాబిన్, ఆమె బోధించిన తరగతి గదులను పరిశీలించారు. ఒక అల్మారాలో ప్లాస్టిక్ కవర్లో చుట్టి దాచిన రూ.18 లక్షల డబ్బును ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు షహీద్ సయీద్‌కు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద ఆత్మాహుతి కారు బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలో 15 మంది మరణించగా 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో నిందితులైన ముజమ్మిల్ షకీల్, అదీల్ అహ్మద్‌తో పాటు షహీద్ సయూద్‌ను శనివారం కోర్టులో హాజరుపర్చారు.
Also Read:
BJP Leader Shot | బీజేపీ సీనియర్ నేతపై కాల్పులు.. ఆరోగ్య పరిస్థితి విషమం
protesters set police on fire | పోలీసులపై పెట్రోల్ చల్లి.. నిప్పంటించిన నిరసనకారులు
Watch: ఏఐ టీచర్‌ను రూపొందించిన కాలేజీ విద్యార్థి.. టీచింగ్ చేస్తున్న వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

