SBI Car Loan Fraud Case | ఎస్బీఐ కార్ లోన్ మోసం కేసులో ఈడీ రైడ్స్.. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్ స్వాధీనం
SBI Car Loan Fraud Case | ఎస్బీఐ కార్ లోన్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు చోట్ల రైడ్ చేసింది. నకిలీ పత్రాలతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నది.
ముంబై: ఎస్బీఐ కార్ లోన్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు చోట్ల రైడ్ చేసింది. నకిలీ పత్రాలతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నది. (SBI Car Loan Fraud Case) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. 2017-2019 మధ్య కాలంలో పూణేలోని యూనివర్సిటీ రోడ్‌లోని ఎస్బీఐ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేసిన అమర్ కులకర్ణి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఆటో లోన్ కౌన్సెలర్ ఆదిత్య సేథియా, కొంతమంది రుణగ్రహీతలతో కలిసి భారీ మోసానికి కుట్రపన్నాడు. తప్పుడు పత్రాలు, నకిలీ కొటేషన్లతో ఖరీదైన కార్ల కొనుగోలుకు పెద్ద మొత్తంలో లోన్లు మంజూరు చేసి కమీషన్లు పొందాడు.
కాగా, బ్యాంకు అంతర్గత దర్యాప్తులో ఈ మోసం బయటపడింది. దీంతో పూణేలోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఏసీబీ కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
మరోవైపు నవంబర్ 25, 26 తేదీల్లో ముంబై జోనల్ ఈడీ అధికారులు పూణేలోని 12 ప్రాంతాల్లో సోదాలు చేశారు. నాటి బ్రాంచ్ మేనేజర్ అమర్ కులకర్ణితోపాటు రుణగ్రహీతల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. వారు కొనుగోలు చేసిన వివిధ స్థిరాస్తుల పత్రాలు, నేరారోపణ పత్రాలతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read:
AAP leader Rajesh Gupta | బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే.. కన్నీటితో కేజ్రీవాల్‌కు సలహా
Cash Found In Room 22 At Al-Falah | అల్ ఫలాహ్లోని 22వ గదిలో.. రూ.18 లక్షల డబ్బు లభ్యం
Watch: ఏఐ టీచర్‌ను రూపొందించిన కాలేజీ విద్యార్థి.. టీచింగ్ చేస్తున్న వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BMWs
- Car Loan
- ED raids
- fraud case
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

