Police Stop Married Cop’s Wedding | మరో మహిళతో రెండో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్.. అడ్డుకున్న పోలీసులు
Police Stop Married Cop's Wedding | పెళ్లై భార్య, పిల్లలున్న కానిస్టేబుల్ మరో మహిళతో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో భార్య, ఆమె కుటుంబం పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరో మహిళతో కానిస్టేబుల్ పెళ్లిని పోలీసులు అడ్డుకున్నారు.
జైపూర్: పెళ్లై భార్య, పిల్లలున్న కానిస్టేబుల్ మరో మహిళతో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో భార్య, ఆమె కుటుంబం పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరో మహిళతో కానిస్టేబుల్ పెళ్లిని పోలీసులు అడ్డుకున్నారు. (Police Stop Married Cop’s Wedding) రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ జై కిషన్‌కు 2011లో రీనాతో పెళ్లి జరిగింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. 2017లో జై కిషన్ ఒక మహిళతో సన్నిహితంగా ఉండటం భార్య రీనా చూసింది. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి అక్కడ ఉంటున్నది.
కాగా, భార్య రీనాకు విడాకులు ఇవ్వకుండానే కానిస్టేబుల్ జై కిషన్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. శుక్రవారం అల్వార్‌లోని హోటల్లో మరో మహిళను అతడు పెళ్లాడుతున్నట్లు భార్య రీనా తెలుసుకున్నది. దీంతో తన పిల్లలు, బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వారంతా అక్కడకు చేరుకున్నారు. మరో మహిళతో జరుగుతున్న కానిస్టేబుల్ జై కిషన్ రెండో పెళ్లిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Alwar में पकड़ी गई कांस्टेबल की चोरी, बच्चों ने पुलिस को फोन किया- ‘पापा दूसरी शादी कर रहे हैं’! pic.twitter.com/s1vQAtrUhA
— Rajasthan Tak (@Rajasthan_Tak) November 29, 2025
Also Read:
AAP leader Rajesh Gupta | బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే.. కన్నీటితో కేజ్రీవాల్‌కు సలహా
Cash Found In Room 22 At Al-Falah | అల్ ఫలాహ్లోని 22వ గదిలో.. రూ.18 లక్షల డబ్బు లభ్యం
protesters set police on fire | పోలీసులపై పెట్రోల్ చల్లి.. నిప్పంటించిన నిరసనకారులు
Watch: ఏఐ టీచర్‌ను రూపొందించిన కాలేజీ విద్యార్థి.. టీచింగ్ చేస్తున్న వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Alwar
- Married Cop
- Police
- Rajasthan
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

