పనాజి: మద్యం మత్తులో ఉన్న యువకుడు కారు డ్రైవ్ చేశాడు. రివర్స్ గేర్‌లో నడిపిన అతడు కారుపై కంట్రోల్ తప్పాడు. దీంతో ఆ కారు రివర్స్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి మీదకు దూసుకెళ్లింది. కాలు విరిగిన అతడు తీవ్రంగా గాయపడ్డాడు. (Drunk’ teen reverses car) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గోవా రాజధాని పనాజిలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం ఒక యువకుడు మద్యం మత్తులో కారు నడిపాడు. కొంతమందిని మార్కెట్ వద్ద దించాడు.
కాగా, మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు కారును రివర్స్ చేశాడు. యాక్సిలరేటర్‌ను బలంగా నొక్కాడు. దీంతో ఆ కారు అదుపుతప్పింది. రివర్స్‌లో వేగంగా వెనక్కి వెళ్లింది. ఒక షాపు ముందున్న బైకులను ఢీకొట్టి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అక్కడున్న 50 ఏళ్ల ముకుల్ జోషిని ఢీకొట్టింది. దీంతో కారు, షాపు గోడ మధ్య చిక్కుకున్న అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు.
మరోవైపు ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. షాపు గోడ, కారు మధ్య చిక్కుకున్న ముకుల్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. కాలు విరిగిన ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. కారు నడిపిన 18 ఏళ్ల షాహిద్ మొహర్రం అన్సారీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Panaji 🚨⚠️ #StopDrinkAndDrive
Disturbing Visuals 🚨🚨 #Drunk #Driver while reversing Polo, rammed pedestrian. 2nd similar incident after Pune while reversing…@DriveSmart_IN @dabir @InfraEye @sss3amitg
pic.twitter.com/n45BjcP9Ue— Dave (Road Safety: City & Highways) (@motordave2) December 2, 2025
Also Read: