చండీగఢ్: తనకంటే అందంగా ఉన్నదన్న అసూయతో బంధువైన మహిళ ఒక బాలికను హత్య చేసింది. నీటి టబ్‌లో ముంచి చంపింది. (Woman Kills Girl) దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో తన కొడుకుతో సహా ముగ్గురు పిల్లలను కూడా ఆమె ఇలాగే హత్య చేసినట్లు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోనిపట్‌కు చెందిన 6 ఏళ్ల విధి తన తల్లిదండ్రులు, పది నెలల సోదరుడు, తాత, నానమ్మతో కలిసి పెళ్లి వేడుక కోసం పానిపట్ ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి చేరుకున్నది.
కాగా, డిసెంబర్ 1న విధి తల్లిదండ్రులు పెళ్లి ఊరేగింపుతో కలిసి వెళ్లారు. ఆ బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువైన పూనమ్ ఇంటి మొదటి అంతస్తులో నానమ్మ వెతికింది. అక్కడున్న స్టోర్‌రూమ్ డోర్ తెరిచి చూసింది. వాటర్ టబ్‌లోని నీటిలో విధి తల మునిగి ఉండటం చూసి ఆమె షాక్ అయ్యింది. ఆ బాలికను వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధి మేనత్త పూనమ్ ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన కంటే అందంగా ఉన్న బాలికలను గతంలో కూడా హత్య చేసినట్లు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.
2023లో వదిన కుమార్తెను నీటిలో ముంచి పూనమ్ చంపింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన కుమారుడ్ని కూడా అదే విధంగా హత్య చేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో సివా గ్రామానికి చెందిన బంధువైన బాలిక తన కంటే అందంగా ఉండటంతో అదే మాదిరిగా నీటిలో ముంచి చంపింది. ఇప్పటి వరకు ఈ పిల్లలంతా ప్రమాదవశాత్తు మరణించినట్లుగా అందరూ భావించారు. అయితే వారిని తానే చంపినట్లు పూనమ్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అరెస్ట్ చేశారు.
Madhya Pradesh | విమాన ప్రయాణాల కోసం.. రోజుకు రూ.21 లక్షలు ఖర్చు చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
Army Soldier Dies | కాలువలో మునిగిన ఆర్మీ ట్యాంక్.. సైనికుడు మృతి
Watch: కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం.. హాస్పిటల్స్‌కు వ్యాపించిన మంటలు, పిల్లలను రక్షించిన స్థానికులు
Watch: కారు రివర్స్ చేసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?