జలసవ్వడి
సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండింది. బుధవారం తెల్లవారుజామున నీటి మట్టం 1493 అడుగులకు చేరుకుని అలుగు పారింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరిగి మూడు రోజుల్లోనే ప్రాజెక్టు నిండి అలుగు దూకింది.
- సంగారెడ్డి జిల్లాలో అలుగుదుంకుతున్న నల్లవాగు ప్రాజెక్టు
- పంట కాల్వలకు ప్రాజెక్టు నీరు విడుదల
- ఆయకట్టు రైతుల్లో ఆనందం
సిర్గాపూర్, ఆగస్టు 5 : సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండింది. బుధవారం తెల్లవారుజామున నీటి మట్టం 1493 అడుగులకు చేరుకుని అలుగు పారింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరిగి మూడు రోజుల్లోనే ప్రాజెక్టు నిండి అలుగు దూకింది. ఎగువ ప్రాంతం నుంచి 1500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో ఔట్ ఫ్లో కొనసాగుతున్నదని సంబంధిత ఏఈఈ మల్లేశం తెలిపారు.
నల్లవాగు నీటి విడుదల : నల్లవాగు ప్రాజెక్టు అలుగు ద్వారా నీరు వృథా కాకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో బుధవారం ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కుడి, ఎడమ తూముల ద్వారా పంట కాల్వలకు సాగు నీటిని విడుదల చేశారు. రెండు కాల్వల కింద చెరువులు నింపుతూ చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ హేమంత్‌కుమార్, ఏఈఈలు మల్లేశం, శ్రీవర్ధన్‌రెడ్డి, సిబ్బంది లష్కర్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

